Begin typing your search above and press return to search.
మారుతిలో ఆందోళన దేనికో తెలిస్తే అంతే సంగతి!
By: Tupaki Desk | 11 Jun 2021 11:00 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంతటివాడు అవకాశం ఇస్తే సినిమా తీయాలని కలలుగనే స్టార్ డైరెక్టర్లు ఎందరో. కానీ బన్ని ఎందరినో కాదని స్నేహానికి విలువిచ్చి తన మిత్రుడు మారుతికి ఏనాడో ఆఫర్ ఇచ్చారు. ఒక మంచి కథ ఉంటే చెప్పమని బౌండ్ స్క్రిప్టు రెడీ చేసుకోమని ఆయన పలుమార్లు ఆఫర్ ఇచ్చినా మారుతి ఎందుకనో దానిని దాటవేస్తూ వస్తున్నాడు.
ఈరోజుల్లో -భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన మారుతికి అప్పట్లోనే బన్ని ఆఫర్ ఇచ్చారని ఇంటర్వ్యూల్లో తెలిపారు. కానీ స్నేహం కోసమే అతడితో పని చేయడం లేదని తాను హిట్టివ్వకపోతే తమ మధ్య అనుబంధం లో కలతలు వస్తాయని మారుతి ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. 20ఏళ్లు గా తమ మధ్య స్నేహం ఉంది. దానిని ఇలానే కొనసాగించాలనేది మారుతి ఆశ.
బన్నితో సినిమా చేయడం అంటే చాలా సంతోషమే. కాని నేను దానిని చేయలేకపోతున్నాను. వృత్తిపరమైన వ్యవహారం కంటే స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తానని మారుతి చెప్పారు. ఎప్పుడైనా బన్నీతో ఒక సినిమా చేస్తే అది అత్యుత్తమంగా ఉండాలి. దాని కోసమే వెంటనే సినిమా చేయాలనుకోవడం లేదు. ఈ చిత్రం బాగా రాణించకపోతే స్నేహం దెబ్బతింటుందని భయపడుతున్నానని తెలిపారు.
మారుతి ప్రస్తుతం గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే చిత్రం తీస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా ఓ చిత్రం షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో కాకుండా నవతరం ట్యాలెంట్ తో సినిమాలు చేయడం వెనక మారుతి స్ట్రాటజీ వేరుగా ఉంది.