Begin typing your search above and press return to search.

తేజ్ మారుతితో జత కట్టింది అందుకే!

By:  Tupaki Desk   |   11 Sep 2019 4:37 AM GMT
తేజ్ మారుతితో జత కట్టింది అందుకే!
X
చేసింది తక్కువ సినిమా అయినా తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న మారుతి ఈ మధ్య ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు విధాల విఫలమయ్యాడు. లేటెస్ట్ గా చైతూతో తీసిన 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ సినిమా తర్వాత కాస్త టైం తీసుకున్న మారుతి ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో 'ప్రతి రోజు పండగే' చేస్తున్న సంగతి తెలిసిందే.

శైలజా రెడ్డి అల్లుడు కి వచ్చిన రెస్పాన్స్ తో ఈసారి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు మారుతి. తేజ్ కోసం ఎమోషనల్ కంటెంట్ తో కథను రాసాడు. సినిమాలో తేజ్ కి తాతగా నటిస్తున్నాడు సత్యరాజ్. తేజ్ హీరో అయినప్పటికీ సినిమా అంతా సత్య రాజ్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇంచు మించు 'శతమానం భవతి' లాంటి సబ్జెక్ట్ అట. మారుతితో పాటు తేజ్ కి కూడా ఈ జోనర్ కొత్తే. ఇద్దరూ కలిసి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేస్తున్నారు.

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తాత మనవళ్ళ కథతో ఎమోషనల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రెడీ చేసారు. ప్రీ లుక్ తోనే కంటెంట్ గురించి చెప్పేసిన మారుతి సత్య రాజ్ - తేజ్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడని తెలుస్తుంది. మరి 'ప్రతి రోజు పండగే తో మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ కు హిట్ సినిమా ఇస్తాడా..లేదా చూడాలి.