Begin typing your search above and press return to search.

బన్నీగారు.. రౌడీహీరో ఇద్దరూ దొరకలేదు!

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:27 AM IST
బన్నీగారు.. రౌడీహీరో ఇద్దరూ దొరకలేదు!
X
చాలా రోజుల నుండి స్టార్ హీరోలను డైరెక్ట్ చెయ్యాలని ఎదురుచూస్తున్నా ఇంకా దర్శకుడు మారుతికి ఆ అవకాశం మాత్రం రాలేదు. నాగచైతన్య తో చేసిన లాస్ట్ సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' ఓపెనింగ్స్ జోరుగానే ఉన్నా ఫైనల్ గా డెఫిసిట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైతు సినిమా తర్వాత మారుతికి మరో ప్రాజక్ట్ ఫైనలైజ్ కాలేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గానీ.. లేటెస్ట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గానీ సినిమా చేసేందుకు మారుతి ప్రయత్నించాడట కానీ వాళ్ళు వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో మారుతి వేరే హీరో కోసం వెతకక తప్పలేదు. దీంతో మారుతి యువ హీరో శర్వానంద్ పై ఫోకస్ చేశాడట. మారుతి - శర్వానంద్ కాంబినేషన్ లో గతంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందుకే మరోసారి శర్వాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. శర్వా లాస్ట్ సినిమా 'పడి పడి లేచే మనసు' బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సినిమా తర్వాత ఒక లైట్ వెయిన్ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

ఆల్రెడీ సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్ పైన ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే మారుతి - శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.