Begin typing your search above and press return to search.

బన్నీకి కథ నచ్చింది

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:28 PM IST
బన్నీకి కథ నచ్చింది
X
ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడు మారుతి రోజులే మారిపోయాయి. రచయితగా, దర్శకుడిగా మంచి పేరుని సంపాదించుకున్నాడు. నిర్మాతగానూ ప్రేమకథా చిత్రం వంటి హిట్ కొట్టాడు. సినీ పరిశ్రమకు రాకముందు యానిమేషన్ నేర్చుకునే రోజుల్లో బన్నీతో దోస్తీ ఏర్పడింది ఈ యూత్ ఫుల్ దర్శకుడికి. దర్శకుడిగా బన్నీతో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుండో చెబుతూ వచ్చిన మారుతి దానిని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వేచి చూస్తున్నాడిప్పుడు.

ఇటీవలే బన్నీకి కథ చెప్పగా నచ్చిందట. అయితే ఎప్పుడు మొదలు పెడదామాన్నది చెప్పలేదట. ఇది చెప్పాల్సింది అరవింద్ గారు కదా మరి. అల్లువారి కాంపౌండ్ లో మారుతికి మంచి పేరే వుంది. అయినా తమ్ముడు తమ్ముడే.. ప్యాకెట్ ప్యాకెట్టే.. అన్న సిద్ధాంతం వారిది. అందులో తప్పులేదు. కొత్తజంట బాగానే వుందనుకున్నా బాక్సాఫీస్ వద్ద అంతగా నిలబడలేదు. బన్నీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో వున్నాడు. మారుతి కోరిక తీరాలంటే భలే భలే మగాడు సినిమా విజయం సాధించాలి మరి. మారుతి తన స్నేహితుడు బన్నీతో త్వరలో సినిమా చేయాలని కోరుకుందాం.