Begin typing your search above and press return to search.

భలే భలే మగాడండోయ్...

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:33 AM IST
భలే భలే మగాడండోయ్...
X
నేటి తరం చిన్న సినిమాలకు రాజమౌళిగా పేరు తెచ్చుకున్న అభినవ దర్శకుడు మారుతి. ప్రస్తుతం స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న ఇతని జీవితం పూలపాన్పు కాదు. చిన్నప్పటినుండీ బాధ్యతలు కష్టాలతో నిండినదే. పేపర్ బాయ్ గా ప్రయాణం మొదలుపెట్టి, యానిమేషన్ కోర్సులు చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. త్రివిక్రమ్ అతడు సినిమాకు లోగో డిజైన్ చేసింది మారుతినే. అయితే అడపాదడపా పలు సినిమాలలో టెక్నీషియన్ లుగా అవకాశాలు వచ్చినా తాను ఎదురుచూస్తున్న దర్శకత్వ అవకాశం మాత్రం అతని దరి చేరడానికి బాగానే సమయం పట్టింది.

ఎలాగైనా ప్రేక్షకుల బుర్రల్లోకి చేరాలని ఈరోజుల్లో - బస్ స్టాప్ వంటి లో బడ్జెట్ - హై ఇంపాక్ట్ కధలను ఎన్నుకున్నాడు. అనుకున్న విజయం సాధించినా అదే రేంజ్ లో విమర్శలు ఎదురయ్యాయి. బూతు సినిమాల దర్శకుడిగా ముద్రపడినా క్రుంగిపోకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేమకధా చిత్రమ్ తెరకెక్కించి ఒక ట్రెండ్ ని సృష్టించాడు.

ఇటీవల మారుతి తీసిన 'భలే భలే మగాడివోయ్' సినిమా అద్భుతమైన విజయం సాధించి చిన్న సినిమాలకు బాహుబలిగా నిలిచింది. ఈ విజయం అందించిన నూతనోత్సాహంతో మరిన్ని స్క్రిప్ట్ లు రాసుకుంటున్నట్టు తెలిపాడు. టాలెంట్ వుంటే విజయం తప్పక వరిస్తుందని రుజువుచేసిన మారుతికి తుపాకీ.కామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు..