Begin typing your search above and press return to search.

`రాజుగాడు`గా రాజ్‌ త‌రుణ్‌

By:  Tupaki Desk   |   28 Jun 2016 6:28 AM GMT
`రాజుగాడు`గా రాజ్‌ త‌రుణ్‌
X
జోరుమీదున్న యువ క‌థానాయ‌కుల్లో రాజ్‌ త‌రుణ్ ఒక‌రు. వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీసుకి న‌మ్మ‌ద‌గ్గ క‌థానాయ‌కుడైపోయాడు. మంచి క‌థ‌ల్ని ఎంచుకొంటాడ‌నే పేరుని సంపాదించాడు. `ఈడో ర‌కం ఆడో ర‌కం` హిట్టు త‌ర్వాత దిల్‌ రాజు సంస్థ‌లో శ‌తమానం భ‌వ‌తి చిత్రంలో న‌టించాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల రాజ్ ఆ ప్రాజెక్టు చేయ‌లేక‌పోయాడు. మారుతి క‌థ‌కి ఓకే చెప్పేసి రంగంలోకి దిగాడు. రాజుగాడు పేరుతో తెర‌కెక్క‌నున్న ఆ చిత్రాన్ని సంజ‌న అనే ఓ కొత్త ద‌ర్శ‌కురాలు తెర‌కెక్కించ‌బోతోంది. నిజానికి ఆ క‌థ‌ని మారుతినే ద‌ర్శ‌క‌త్వం చేయాల్సింది. కానీ బాబు బంగారంతో ఆయ‌న నెక్స్ట్ లీగ్‌ కి వెళ్లిపోయాడు. త‌దుప‌రి మ‌రో స్టార్ క‌థానాయ‌కుడితో సినిమా చేయాల‌నుకొంటున్నాడు. అందుకే తాను రాజ్‌ త‌రుణ్ కోసం త‌యారు చేసుకొన్న క‌థ‌ని వేరొక‌రికి అప్ప‌గించేశాడు.

మ‌రి రాజ్‌ త‌రుణ్ రాజుగాడుగా చేయ‌నున్న సంద‌డి ఎలా ఉంటుందో చూడాలి. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈడో ర‌కం ఆడో ర‌కం చిత్రానికి కూడా ఆయ‌నే నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు.