Begin typing your search above and press return to search.

#స్వీటీ పెళ్లి.. క్రికెట‌ర్ కాదు డైరెక్ట‌రా!!

By:  Tupaki Desk   |   27 Feb 2020 4:30 AM GMT
#స్వీటీ పెళ్లి.. క్రికెట‌ర్ కాదు డైరెక్ట‌రా!!
X
అనుష్క శెట్టి వివాహంపైనే అంద‌రి ఆస‌క్తి. స్వీటీ పెళ్లాడి భ‌ర్త‌ పిల్లా పాప‌ల‌తో హాయిగా కాపురం చేసుకోవాల‌నేది అభిమానుల ఇంట్రెస్టు. ముఖ్యంగా స్వీటీ అంటే గాసిప్ రాయుళ్ల‌కు బోలెడంత అభిమానం. అమితాస‌క్తి. అందుకే ప్ర‌తిసారీ త‌న‌కు సంబంధించిన‌ ఎఫైర్ వార్త‌ల్ని సంచ‌ల‌నం చేశారు. ఇంత‌కుముందు డార్లింగ్ ప్ర‌భాస్ తో ముడి పెట్టేసారు. ఐదేళ్ల పాటు బాహుబ‌లి కోసం కాల్షీట్లు కేటాయించేసిన ఆ ఇద్ద‌రూ నిండా ప్రేమ‌లో మునిగారని బాహుబ‌లి రిలీజైపోగానే పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఆ త‌ర్వాత అదంతా నిజం కాద‌ని ప్ర‌భాస్ ఖండించారు.

ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌తో స్వీటీ ఎఫైర్ కొన‌సాగిస్తోంద‌న్న ప్ర‌చారం అంతే జోరుగా సాగింది.
ఇవేకాదు.. టాలీవుడ్ పై పాగా వేసిన ఓ భూ మాఫియా డాన్ ల‌ బెదిరింపుల‌కు అనుష్క బెంబేలెత్తింద‌న్న ప్ర‌చారం ఒక‌ప్పుడు అంతే ఇదిగా సాగింది. ఆ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాయ్. ఇక ఇటీవ‌లి కాలంలో స్వీటీ న‌ట‌న‌ను విర‌మించుకుని ఇంట్లో చూసిన కుర్రాడిని పెళ్లాడేందుకు రెడీగా ఉంద‌న్న ప్ర‌చారం సాగిపోయింది. సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డం త‌న పాలిట శాపం అయ్యింద‌ని దాని వ‌ల్ల‌నే కెరీర్ కోల్పోయింద‌ని.. అందుకే ఆ బ‌రువును త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌యాస‌లు ప‌డింద‌ని మీడియా తామ‌ర‌తంప‌ర‌గా ప్ర‌చారం చేసింది. గ‌త కొద్ది కాలంగా స్వీటీ ఓ ప్ర‌ముఖ క్రికెట‌ర్ ని పెళ్లాడ‌బోతోంద‌న్న ప్ర‌చారం సాగ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే మొన్న‌నే ప‌నిగ‌ట్టుకుని త‌న‌పై సాగిస్తున్న ఆ ప్ర‌చారాన్ని స్వీటీ ఖండించింది.

ఇంత జ‌రిగినా గాసిప్ రాయుళ్లు అస‌లు స్వీటీని వ‌ద‌ల‌నే లేదు. తాజాగా మ‌రో రూమ‌ర్ వేడెక్కిస్తోంది. ప్ర‌భాస్ కాదు.. పారిశ్రామిక వేత్త కాదు..క్రికెట‌ర్ కాదు.. ఓ వెట‌రన్ డైరెక్ట‌ర్ కుమారుడు కం యంగ్ డైరెక్ట‌ర్ ని అనుష్క పెళ్లాడ‌బోతోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అత‌గాడు ఇప్ప‌టికే త‌న భార్య‌కు అధికారికంగా విడాకులు ఇచ్చి స్వీటీతో ఎఫైర్ సాగిస్తున్నాడ‌ని వేడెక్కిపోయే మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక అత‌డిని పెళ్లాడేందుకు అనుష్క రెడీ అవుతోంద‌న్న వార్తా సంచ‌ల‌న‌మైంది. పెళ్లికి స‌మ‌యం ఇంకెంతో దూరంలో లేదు. ఈ ఏడాది చివర్లోనే అంటూ హీట్ పెంచేసారు. స్వీటీ న‌టించిన నిశ్శ‌బ్ధం ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అటుపై పెళ్లి ప‌నులే అన్నంత‌గా ప్ర‌చారం సాగిపోతోంది. తాజా రూమ‌ర్ పై స్వీటీ స్పందించాల్సి ఉంది.