Begin typing your search above and press return to search.

మెగాహీరోతో కొరటాల మార్క్ యాక్షన్ సీక్వెన్స్..!

By:  Tupaki Desk   |   15 April 2021 3:30 AM GMT
మెగాహీరోతో కొరటాల మార్క్ యాక్షన్ సీక్వెన్స్..!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్. మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాంచరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆచార్య విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆచార్య మూవీ ప్రస్తుతం తుదిదశలో ఉంది. ఈ సినిమాలో చరణ్ చాలా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఆచార్యలో రాంచరణ్ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసారట మేకర్స్.

చరణ్ ఇంతవరకు కనిపించని యాక్షన్ సన్నివేశాలలో కనిపిస్తాడని టాక్. కొరటాల సినిమాలో యాక్షన్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఏ సన్నివేశం అయినా కొరటాల మార్క్ కనబడేలా ఉంటుంది. చరణ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా స్టైలిష్ అండ్ కూల్ గా ఉండబోతున్నాయని టాక్. అసలే రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ ఆకలితో ఉన్నాడు. అలాంటిది కొరటాల లాంటి డైరెక్టర్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ రాస్తే పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో ఊహించలేం. మెగాస్టార్ ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో రెయిన్ ఫైట్ కూడా ప్లాన్ చేసారని టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ ఆచార్యను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.