Begin typing your search above and press return to search.

ఖాళీగా ఉంద‌ట‌.. ట్రై చేస్తుంటే దొర‌క‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   16 April 2017 10:06 AM GMT
ఖాళీగా ఉంద‌ట‌.. ట్రై చేస్తుంటే దొర‌క‌ట్లేద‌ట‌
X
టెన్నిస్ స్టార్ మ‌రియా ష‌ర‌పోవా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె ఆట‌ను.. అంత‌కు మించి ఆమె అందాన్ని ఎంత‌గా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆమెకు ఫ్యాన్స్‌. అలాంటి ఆమెకు.. స‌రైన తోడు దొర‌క్క తెగ ఫీలైపోతోంది. నిషేధిత డ్ర‌గ్స్ వాడి స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఆమె.. తాజాగా త‌న‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట్ల‌ను చెప్పుకొచ్చారు.

ఆమె మాట‌లు వింటే.. మ‌న‌సు జివ్వుమ‌ని లాగ‌ట‌మే కాదు.. ష‌ర‌పోవాకు ఎంత క‌ష్టం వచ్చింద‌ని ఫీల్ కావ‌టం ఖాయం. డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు బ్యాన్‌ కు గురైన ఆమె.. ఆట లేని వేళ‌.. బాయ్ ఫ్రెండ్‌ తో డేటింగ్ కోసం త‌హ‌త‌హ‌లాడింద‌ట‌. డేటింగ్ చేయ‌టానికి తెగ ట్రై చేసినా ఆమెకు కావాల్సిన వ్య‌క్తి మాత్రం దొర‌క‌లేద‌ని చెబుతోంది. త‌న ప్రేమ అన్వేష‌ణ ఫ‌లించ‌లేద‌ని.. దీంతో ఏడాదిగా ఎవ‌రితోనూ డేటింగ్ చేయ‌టానికి వీలు కాలేద‌న్నారు.

తాను భ‌య‌పెట్టే మ‌నిషిన‌ని మ‌గాళ్లు అనుకుంటార‌ని.. కానీ తాను అలాంటి దాన్ని కాద‌న్న‌ది ష‌ర‌పోవా వాద‌న‌. మ‌రోవైపు.. త‌న అభిరుచుల గురించి చెబుతూ.. విభిన్న సంస్కృతుల‌కు చెందిన విభిన్న‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి గ‌డ‌పాల‌న్న చిత్ర విచిత్ర‌మైన కోరిక ఉన్నా తీర‌లేద‌న్న ఆమె.. త‌న‌కు ప్ర‌పంచం మొత్తం చుట్టి రావాల‌న్న కోరిక కూడా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 29 ఏళ్ల ఈ సుంద‌రాంగికి న‌చ్చే వ్య‌క్తిలో ఉండాల్సిన‌వేమిట‌న్న విష‌యంలోకి వెళితే.. సొంత జీవిత దృక్ఫ‌థంతో త‌న రంగును.. వ్య‌క్తిత్వాన్ని గౌర‌వించుకునే వ్య‌క్తి న‌చ్చుతాడ‌ని త‌న‌కు కావాల్సిన వ్య‌క్తి గురించి చెప్పుకొచ్చింది. మ‌రి.. ష‌ర‌పోవాల లాంటి అందాల రాశి మ‌న‌సును దోచుకునే మ‌గాడు ఎవ‌రో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/