Begin typing your search above and press return to search.

వీడియో : ఆకట్టుకుంటున్న మరక్కర్ కన్నులను కలిపిన..!

By:  Tupaki Desk   |   21 Nov 2021 7:32 AM GMT
వీడియో : ఆకట్టుకుంటున్న మరక్కర్ కన్నులను కలిపిన..!
X
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ ప్రతిష్టాత్మక సినిమా మరక్కర్ విడుదలకు సిద్దం అయ్యింది. కేరళలో ఈ సినిమా ను థియేటర్ రిలీజ్ కు చేయాలని చాలా కాలంగా వాయిదా వేస్తున్నారు. కాని పరిస్థితులు అక్కడ కుదుట పడ్డట్లుగా అనిపించినా కూడా థియేటర్లకు జనాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో పాటు ప్రభుత్వం ఆంక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.

ఓటీటీ లో డైరెక్ట్‌ స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ పాటలను విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి కన్నులను కలిపిన అనే మెలోడీ సాంగ్ వచ్చింది. ఆ పాట తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

తెలుగు లో మరక్కర్ ను విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు మరక్కర్ లో నటించిన మోహన్ లాల్.. కీర్తి సురేష్‌.. అర్జున్‌.. ప్రభు.. మంజు వారియర్ ఇలా ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు ఉన్న వారే. కనుక తెలుగు లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ సమయంలో తెలుగు లో కన్నులను కలిపిన పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాట సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను భారీగా పెంచేస్తుంది అనడంలో సందేహం లేదు. పాటలో ఉన్న విజువల్స్ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

కీర్తి సురేష్ లుక్‌ మరియు ఇతర పాత్రల తీరు చూస్తుంటే సినిమా ఒక కొత్త అనుభూతిని కలిగించబోతున్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్నారు. తాజాగా విడుదల అయిన కన్నులను కలిపిన పాటను తెలుగు లో చిన్మయి పాడింది. పాటకు ఆమెకు ప్రాణం పోసినట్లుగా పాడిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. వెన్నెల కంటి సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయితో కలిసి సత్య ప్రకాష్ పాడాడు. పాట లిరిక్స్ మరీ డబ్బింగ్ సినిమా పాట మాదిరిగా కాకుండా మంచి ఫీల్ ఉన్న పాట మాదిరిగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.