Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి

By:  Tupaki Desk   |   1 Nov 2021 3:30 AM GMT
పాన్ ఇండియా మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి
X
క‌రోనా క్రైసిస్ అంతా మార్చేసింది. సినిమా వ్యాపార‌శైలి కూడా మారిపోయింది. ఇప్పుడు అంతా ఓటీటీదే హ‌వా. ఇదే నేప‌థ్యంలో సూర్య‌- ధ‌నుష్ లాంటి స్టార్లు త‌మ సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ఆ ఇద్ద‌రినీ ఇప్ప‌టికే ఓటీటీ స్టార్లుగా జ‌నం గుర్తించారు. ఇప్పుడు ఇదే కేట‌గిరీలో మ‌రో ప్ర‌ముఖ స్టార్ చేర‌బోతున్నార‌నేది తాజా గుస‌గుస‌.

హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ త‌ర‌హాలోనే కేర‌ళ‌లోనూ థియేట‌ర్ల వ్య‌వ‌స్థ చాలా కాలంగా అస్థ‌వ్య‌స్థంగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తాకిడి కేర‌ళ‌ను కాస్త ఆల‌స్యంగా తాక‌డంతో దాని ప్ర‌భావం వ‌ల్ల చాలా చోట్ల థియేట‌ర్ల‌ను తెర‌వలేదు. ఇది బ‌డా స్టార్ల సినిమాల‌కు పెద్ద ముప్పుగా మారింది. ఆ క్ర‌మంలోనే సూప‌ర్స స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన ఓ సినిమా ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

లాల్ న‌టించిన భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం మరక్కర్ థియేట్రికల్ విడుదలను వ‌దులుకుంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని భావించినా ఇప్పుడు నిర్ణ‌యం మార్చుకున్నారు. నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నార‌ని తెలిసింది. ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని... అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దృశ్యం 2 నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్క‌డ‌ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మోహన్ లాల్ మరక్కర్ తో అదే వేదికపై రెండవ హిట్ సాధించాల‌ని భావిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన చిత్ర‌మిది. కుంజలి మరక్కర్ IV .. పోర్చుగీస్ నేప‌థ్యంలో పీరియాడిక్ స్టోరీతో ఈ మూవీ తెర‌కెక్కింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ లో రావాల్సి ఉన్నా వాయిదా ప‌డి ఇప్పుడు ఓటీటీలో వ‌స్తోంది.