Begin typing your search above and press return to search.

'మరక్కార్' టీజర్-2: అరేబియన్ సముద్ర సింహం వచ్చేస్తోంది..!

By:  Tupaki Desk   |   25 Nov 2021 1:36 PM GMT
మరక్కార్ టీజర్-2: అరేబియన్ సముద్ర సింహం వచ్చేస్తోంది..!
X
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ''మరక్కార్: అరేబియా సముద్ర సింహం''. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ - అర్జున్ సర్జా - మంజు వారియర్ - అశోక్ సెల్వన్ - సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే చివరకు మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గుచూపారు.

'మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సెకండ్ టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది.

మోహన్ లాల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 'మరక్కార్' చిత్రాన్ని విజువల్ వండర్ గా రూపొందించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. 'బాహుబలి' సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్.. తిరు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. రోనీ రాఫెల్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. అంకిత్ సూరి - రాహుల్ రాజ్ - లయెల్ ఎవాన్స్ రోడెర్ నేపథ్య సంగీతం అందించారు. అయ్యప్పన్ నాయర్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

'మరక్కార్' చిత్రంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ - దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె, 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు - సిద్ధిఖ్ - సుహాసిని మణిరత్నం - నెడుముడి వేణు - ఫాజిల్ - రంజిఫణిక్కర్ - హరీశ్ పేరడి - ఇన్నోసెంట్ ఇతర పాత్రల్లో నటించారు. ఆశీర్వాడ్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ విడుదలకు ముందే 'ఉత్తమ చిత్రం' -'బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్' - 'కాస్ట్యూమ్ డిజైనింగ్' విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుపొందడం విశేషం. 'కాలాపానీ' చిత్రం అనంత‌రం సుదీర్ఘ విరామం త‌రువాత‌ ప్రియ‌ద‌ర్శన్‌ - మోహ‌న్‌ లాల్ - ప్రభు కాంబినేషన్‌ లో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.