Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: కడలిలో కనికట్టు చేసే `కుంజాలీ`
By: Tupaki Desk | 6 March 2020 9:00 PM ISTకొంతకాలంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. `లూసిఫర్`తో భారీ హిట్ కొట్టిన మోహన్ లాల్....తాజాగా `మరక్కార్`తో మరో భారీ హిట్ సొంతం చేసుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'మరక్కార్`లొో అరేబియా సముద్ర సింహంగా మోహన్ లాల్ అలరించబోతున్నాడు. పోర్చుగీసు వారు భారత్ లో వర్తకం చేసే నేపథ్యంలో ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు. 'మరక్కార్... అరబిక్ కడలింతే సింహం' తెలుగు వెర్షన్ 'మరక్కార్` అరేబియా సముద్ర సింహం ట్రైలర్ ను ప్రొడక్షన్ ప్లాట్ ఫాంలో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా...తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో రామ్ చరణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరు చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన ప్రియ మిత్రుడు మోహన్ లాల్, ప్రియదర్శన్ ల డ్రీమ్ ప్రాజెక్టు 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చిరు అన్నారు. సినిమాటోగ్రాఫర్ తిరు మరోసారి వెండితెరపై అద్భుత చిత్రకావ్యాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నానని చిరు అన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'మరక్కార్...' పాన్ ఇండియా చిత్రంలో మోహన్ లాల్ కు జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ లాల్ నట వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోవడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో యశ్, తమిళంలో సూర్య రిలీజ్ చేశారు.
`కుంజాలి` పాత్రలో మోహన్ లాల్ ఆకట్టుకున్నాడు. పేద ప్రజలకు దేవుడిగా....దుర్మార్గులపాలిట యముడిలా ఉండే కుంజాలి పాత్రను మోహన్ లాల్ పోషించాడు. కడలిలో కనికట్టుతో అల్లాడించే మాంత్రికుడు కుంజాలీ జాడ కనిపెట్టడం కోసం శత్రువులు వేసే ఎత్తులను చిత్తు చేసే అరేబియన్ సింహంలా మోహన్ లాల్ కనికట్టు కట్టాడు.పోర్చుగీసువారిని తన రాజ్యంలో కాలుపెట్టనివ్వకుండా కుంజాలీ చేసే సాహసాలు ఆకట్టుకున్నాయి. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ తరహా సన్నివేశాలు మరక్కార్ లో కనువిందు చేయనున్నాయి. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.