Begin typing your search above and press return to search.

స్టార్స్‌ అందరి లో మలయాళి స్టార్స్‌ వేరయ్యా

By:  Tupaki Desk   |   18 Dec 2019 5:44 AM GMT
స్టార్స్‌ అందరి లో మలయాళి స్టార్స్‌ వేరయ్యా
X
కేంద్రం రాష్ట్రంలలో ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాల కు సినీ స్టార్స్‌ మద్దతు తెలుపడం మనం చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. కొందరు మద్దతు తెలపకున్నా కూడా వ్యతిరేకంగా అయితే మాట్లాడరు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్స్‌ ప్రభుత్వాలకు వ్యతిరేకం గా మాట్లాడిన సందర్బాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీతో బాలీవుడ్‌ స్టార్స్‌ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. కనుక ఆయన చేసే ప్రతి పనికి ఎక్కువ శాతం మంది మద్దతుగానే నిలుస్తున్నారు.

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ స్టార్స్‌ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ను ఎక్కువ వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన పౌరసత్వ సవరణ బిల్లును కూడా హిందీ.. తెలుగు.. తమిళ స్టార్స్‌ వ్యతిరేకించడం లేదు అలా అని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం లేదు. చాలా సైలెంట్‌ గా ఉంటున్నారు. ఒక్కరు ఇద్దరు మినహా ఈ విషయమై స్పందిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. కాని మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం అలా కాదు.

కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే కీలక నిర్ణయాల పై మలయాళ సినీ స్టార్స్‌ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. వాపపక్ష పార్టీల పాలనలో ఉన్న కేరళ వాసులు మొదటి నుండి కూడా ఏదైనా విషయంలో తమ వాదన బలంగా వినిపించడంలో ముందు ఉంటారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై కూడా కేరళ చాలా బలంగా తమ వాదన వినిపిస్తుంది. కేంద్రం తీసుకు వచ్చిన బిల్లును తమ రాష్ట్రంలో అమలు చేయబోము అంటూ ఇప్పటికే కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక మలయాళ సినీ తారలు పలువురు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని.. ఇది ప్రజాస్వామ్య విరుద్దం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్‌ పై కూడా మలయాళ సినీ స్టార్స్‌ మండి పడ్డారు.

ప్రశాంతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఇలాంటి బిల్లులు తీసుకు వచ్చారంటూ నటి రీమా అభిప్రాయం వ్యక్తం చేశారు. మలయాళ స్టార్‌ హీరోలు మమ్ముట్టి మరియు మోహన్‌ లాల్‌ తప్ప దాదాపుగా మిగిలిన వారంతా కూడా ఈ చట్టంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇతర భాషల స్టార్స్‌ తో పోల్చితే మలయాళ స్టార్స్‌ చాలా స్పెషల్‌ అంటున్నారు.