Begin typing your search above and press return to search.

మన ఊరొచ్చిన సెక్సీ చిల్లర్

By:  Tupaki Desk   |   31 Jan 2018 2:30 PM GMT
మన ఊరొచ్చిన సెక్సీ చిల్లర్
X
గత ఏడాది నవంబర్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో అందాల కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లర్ ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అంతకుముందు ఎవరికీ ఎక్కువగా తెలియని మానుషి.. కీరిటం అందుకోగానే ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్న ప్రతి చూపును తన వైపుకు తిప్పుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు పలు రాష్ట్రాల నుంచి కొన్ని పురస్కారాలు కూడా అందాయి.

అయితే ఈ హర్యానా బ్యూటీ తెలుగు నేలపై కూడా అడుగుపెట్టింది. ఇంతకుముందు కూడా అమ్మడు కొన్ని ఫ్యాషన్ షోల కోసం ఇక్కడకు వచ్చింది.. కానీ అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మానుషిని చూడటానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఓ బ్యూటీ ప్రాజెక్ట్ మరియు పీరియడ్స్ పై అమ్మాయిల్లో ఆవశ్యకత పెంచే నిమిత్తం ఇక్కడికి చేరుకున్న మానుషి తన అనుభవాలను మిస్ వరల్డ్ సిస్టర్స్ తో పంచుకొనుందట. కొన్ని వారాల వరకు హైదరాబాద్ లోనే ఉండనుంది.

అయితే ఈ మిస్ వరల్డ్ సినిమాల్లో నటిస్తే బావుండు అని చాలా మంది అంటున్నారు. కానీ 20 ఏళ్ల మనుషి మాత్రం ఇప్పుడే సినిమాల్లోకి రాను అంటోంది. ఇంకా దానికి చాలా టైమ్ ఉందని ఒకవేళ అమిర్ ఖాన్ తో నటించే అవకాశం వస్తే మాత్రం వెంటనే ఒప్పుకుంటానని తన గత ఇంటర్వ్యూలో తెలిపింది.