Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సరి లేని సొగసరి

By:  Tupaki Desk   |   2 March 2018 4:32 AM GMT
ఫోటో స్టోరి: సరి లేని సొగసరి
X

అందగత్తెలెంతో మంది ఉంటారు. వాళ్లలో అట్రాక్టివ్ గా కొంతమందే ఉంటారు. గ్లామర్ ప్రపంచం గుర్తించేంత సెక్సీగా తక్కువమందే ఉంటారు. కానీ ప్రపంచం మొత్తం గుర్తించేంత గ్లామర్ గా.. అతికొద్ది మందే ఉంటారు. అలాంటి అపురూపమైన అందగత్తె మానుషి చిల్లర్. అందుకే వందలాది మంది అప్పరసల్లో మేటిగా నిలిచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.

మామూలు అందగత్తెలు అలా చూస్తేనే కుర్రోళ్ల గుండెలు లయ తప్పుతాయి. అలాంటిది సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ లాంటి మానుషి అలా నుంచి వాలుచూపు చూస్తూ ఉంటే కలవరపడిపోని మనిషి ఉంటాడా... తీరిక చేసుకుని చెక్కిన శిల్పం లాంటి వయ్యారం... నాజూకు మెడ వంపులోనే చూపులన్నీ చిక్కుకుపోయేలా చేసే నయగారం కచ్చితంగ మానుషికే సొంతమని చెప్పాలి. అందునా క్లీవేజ్ అందాలన్నీ ఆరబోస్తూ అలా నిలుచున్న ఈ సొగసరిని చూస్తే చూపు గతి తప్పుతుంది. మనసు మతి తప్పుతుంది అంటే ఎంతమాత్రమూ తప్పుకాదు.

అందగత్తెలందరికీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి ఫిలి ఇండస్ట్రీ సదా సంసిద్ధంగానే ఉంటుంది. మానుషీ కన్నా ముందు బ్యూటీ కిరీటం దక్కించుకున్న వారంతా హీరోయిన్లుగా రాణించి మెప్పించారు. డ్యాన్సింగ్.. సింగింగ్ లలో మంచి పట్టున్న మానుషి బాలీవుడ్ ఎంట్రీ ఏమంత కష్టం కాదు. కాబట్టి సరిలేని ఈ సొగసరిని.. వంపుసొంపుల సిరిని త్వరలోనే వెండితెరపై చూడొచ్చు.