Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టెంప‌రేచ‌ర్ పెంచుతోంది

By:  Tupaki Desk   |   9 May 2018 7:58 AM GMT
ఫోటో స్టోరి: టెంప‌రేచ‌ర్ పెంచుతోంది
X
మిస్ వ‌ర‌ల్డ్ 2017 కిరీటం అందుకున్న‌మ‌నూషి చిల్ల‌ర్ బికినీలో మెర‌వ‌డం కొత్తేమీ కాదు. మామూలు డ్రెస్సుల్లో చేసే ఫోటో షూట్స్ లో కూడా కనిపించీ క‌నిపించ‌కుండా వ‌య్యారాలు వ‌లికిస్తూ మ‌నూషి చేసే సంద‌డే ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే బికినీ వేసిన ప్ర‌తీసారి కొత్త‌గా చూస్తున్న‌ట్టు... ఇంకా ఏదో చూడాల‌నిపించేలా ఊరిస్తూ క‌నిపించ‌డం మాత్రం అమ్మ‌డికే చెల్లింది. ఇప్పుడు కూడా అలాగే ఊరిస్తోంది మ‌నూషి.

రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కోసం స‌ముద్ర తీరానికి వెళ్లింది మ‌నూషి చిల్ల‌ర్‌. అక్క‌డ ఇలా బ్లాక్ అండ్ వైట్ బికినీలో మెరిసిపోతూ క‌నిపించింది. ‘ముఖానికి అల‌స‌ట త‌ప్ప మ‌రో మేక‌ప్ లేదు... ఈరోజు స‌ముద్ర‌మే నా హెయిర్ స్టైలిస్ట్‌...’ అంటూ కామెంట్ కూడా పెట్టింది మ‌నూషీ. స‌ముద్ర నీటిలో తాను సేద తీరుతూ... ఆమె అందాల‌ను చూసేవారికి కూడా దాహం పెంచేస్తోందీ పిల్ల‌. మామూలుగా అయితే స్వీమ్ సూట్లో పాప అందాల‌ను చూస్తూ త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందులోనూ హాట్ వాతావ‌ర‌ణంలో ఇంత హాట్ గా క‌నిపిస్తే ఆ టెంప‌రేచ‌ర్ త‌ట్టుకోవ‌డం కుర్రాళ్ల వ‌ల్ల అయ్యే ప‌నేనా చెప్పండి. ఇలాంటి హాట్ ఫోటోలే మ‌నూషీ ఫాలోయింగ్ ని విప‌రీతంగా పెంచుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ ఇర‌వై ఏళ్ల చిన్న‌దాని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 3.5 మిలియ‌న్లు ఉందంటే పాప క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి ఫోటోలు ఇంకొన్ని ప‌డితే... ఆ సంఖ్య మ‌రింత పెరిగిపోవ‌డ‌మూ ప‌క్కా.