Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కొండల మధ్యలో అందం

By:  Tupaki Desk   |   2 March 2018 2:30 PM GMT
ఫోటో స్టోరి: కొండల మధ్యలో అందం
X
ఫెమినా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ఈ మధ్య సోషల్ మీడియా లో అదరగొట్టేస్తోంది. మిస్ వరల్డ్ కంపెటిషన్లో బికినీ రౌండ్ తీసేసారు అని బాధపడ్డ వాళ్ళ కోసం అనుకుంటా తన అందాన్ని ఆరబోయడానికి ఇన్ స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుంది.

ఎప్పుడు యక్టీవ్ గా ఉంటూ బోలెడు పోస్టులు పెట్టేసే మానుషి కి ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ లెక్క ఈమధ్యనే 3 మిలియన్ కు చేరిందంట. ఈ విషయాన్ని తానే చెప్పుకుంటూ అందరికి థాంక్స్ అని చెప్తోంది. అలానే హ్యాపీ హొలీ అంటూ విషెస్ కూడా చెప్పి ఇంస్టా ఫ్యామిలి అంటూ హాష్ టాగ్లు పెట్టేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె పెట్టిన ఫోటో నే హైలైట్. వన్ పీస్ బికినీ వేసుకుని కొండల మధ్యలో పక్కకు చూస్తూ నవ్వుతున్న మానుషి ని చూస్తే అరే ప్రకృతి కంటే ఈమే అందంగా ఉందే అనాల్సిందే.

సినిమాలతో కాకపోయినా ఇలా సోషల్ మీడియాలో మానుషి ఎప్పుడు తన ఫాన్స్ కి కవ్విస్తూనే ఉంటుంది. ముఖంలో కళ - అందమైన ఆకృతి - మురిపించే నవ్వు - టాలెంట్ ఒక హీరోయిన్ కు కావలసిన అన్ని క్వాలిటీలు ఈమె దగ్గర మెండుగా ఉన్నాయి. మరి ఈ భామ ఎప్పుడు పెద్ద తెర ఎక్కుతుందో చూద్దాం..