Begin typing your search above and press return to search.

హల్లో.. కొత్త కుమారి భారతదేశం వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Jun 2017 12:42 PM IST
హల్లో.. కొత్త కుమారి భారతదేశం వచ్చేసింది
X
ప్రతీ ఏడాది ఇండియాలో అందాల పోటీలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో మిస్ ఇండియా పోటీలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. దేశం నలుమూలల నుండి కుమారి భారతేదశం కిరీటాన్ని సొంతం చేసుకోవాలనే పోటీపడుతూనే ఉంటారు. ఈసారి మిస్ ఇండియా 2017 పోటీలో మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇద్దరు భామలు రేసులో ఉన్నారు. ఇంతకీ ఇప్పుడు ఏ కుమారి ఆ కిరీటాన్ని సొంతం చేసుకుందో తెలుసా?

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ ఇప్పుడు మిస్ ఇండియా 2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ హర్యానా కిరీటం గెలిచిన 20 ఏళ్ళ సుందరి.. తన పోయెట్రీతో పెయిటింగ్స్ తో అలాగే కూచిపూడి నాట్యంతో అందరినీ ఆకట్టుకుంది. పైగా ఆల్రెడీ క్యాన్సర్ బాధితుల కోసం పోరాడుతున్న ఈ అమ్మాయి.. 2014లో ఇంటర్ కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా.. జపాన్ వెళ్ళి మనదేశం తరుపును కూచిపూడి ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే 1వ రన్నరప్ క్రింది జమ్మూ కాశ్మీర్ కు చెందిన అందాల సుందరి సనా దువా.. అలాగే 2వ రన్నరప్ క్రింద బీహార్ కు చెందిన ప్రియాంకా కుమారి.. కిరీటాన్ని గెలుచుకున్నారు.

మన ఆంధ్రప్రదేశ్ నుండి ఫైనల్ లిస్టులో ఉన్న శ్రిష్టి వ్యాకరణం.. అలాగే తెలంగాణకు చెందిన స్రిమ్రాన్ చౌదరి.. ఈ పోటీల ఫైనల్ లో చతికిలబడ్డారు. కాని సౌత్ నుండి మిస్సిండియా ఈవెంట్ ను దడదడలాడించడంతో.. వీరికి మన సినిమాల్లో మాంచి ఛాన్సులు దొరికే ఛాన్సుంది. ఆల్రెడీ ఇద్దరూ కూడా కొన్ని చిన్న సినిమాల్లో నటించారట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/