Begin typing your search above and press return to search.

ఓటీటీ వైపు చూసే నటీనటులకు జాతీయ ఉత్తమ నటుడి సలహా..!

By:  Tupaki Desk   |   8 Jun 2021 9:30 AM GMT
ఓటీటీ వైపు చూసే నటీనటులకు జాతీయ ఉత్తమ నటుడి సలహా..!
X
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ - సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ''ది ఫ్యామిలీ మ్యాన్ 2''. దర్శకద్వయం రాజ్ & డికే రూపొందించిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబడి విశేష ఆదరణ దక్కించుకుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు కొనసాగింపుగా వచ్చిన సీజన్ 2, ప్రస్తుతం ఓటీటీ కంటెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక ఇందులో రాజీ పాత్రలో సామ్ కు.. టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా నటించిన మనోజ్ పాజ్ పాయ్ కు ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ సక్సెస్ గురించి మనోజ్ బాజ్ పాయ్ తాజాగా స్పందించారు.

ఒక సిరీస్ ను తెరకెక్కించడానికి ఎంత శ్రమ పడతారో నాకు తెలుసని.. ఫ్యామిలీ మ్యాన్ 2 కి వస్తున్న విశేషమైన స్పందన ఎంతో సంతోషం కలిగిస్తుందని మనోజ్ బాజ్ పాయ్ అన్నారు. సమంత గురించి మాట్లాడుతూ.. ఆమె రాజీ పాత్రలో జీవించిందని, తనకంటే బాగా నటించిందని మెచ్చుకున్నాడు. ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ ఈ షో లో తన పాత్ర పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆమె శ్రమించిన తీరు ఆశ్చర్యం కలిగించిందని మనోజ్ తెలిపారు. 'ఫ్యామిలీ మ్యాన్ 3' గురించి స్పదిస్తూ తన మైండ్ లో ఏమీ లేదని.. రాజ్-డీకే లు తనతో ఇంకా దానిపై చర్చించలేదని.. మూడవ సీజన్ ని కూడా రెడీ చేస్తారంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని మనోజ్ బాజ్ పాయ్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఓటీటీ రంగంలోకి రావాలనుకునే వారికి మనోజ్ బాజ్ పాయ్ సలహా ఇచ్చారు. ఒక నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని తెలిపారు. డిజిటల్ ఆడియన్స్ ఇప్పుడు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దని మనోజ్ సలహా ఇస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' తనను కొత్త తరానికి పరిచయం చేసిందని.. ఇందులో శ్రీకాంత్ తివారీ పాత్ర వల్ల ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా తన దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని ఆయన చెప్పారు. గతంలో ఈ ఏజ్ ఫ్యాన్స్ తనకు లేరని.. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కొత్త ఫ్యాన్ బేస్ ని ఇచ్చిందని మనోజ్ బాజ్ పాయ్ చెప్పుకొచ్చారు.