Begin typing your search above and press return to search.

పుష్ప కోసం రాబోతున్న ఫ్యామిలీ మ్యాన్‌

By:  Tupaki Desk   |   19 July 2022 9:30 AM GMT
పుష్ప కోసం రాబోతున్న ఫ్యామిలీ మ్యాన్‌
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో రాబోతున్న పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 సాధించిన విజయం నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కేజీఎఫ్ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకుని కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బ్రేక్‌ చేసినట్లుగా పుష్ప 2 అద్బుతం ను ఆవిష్కరించబోతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఆ స్థాయిలో కాకున్నా ఆ స్థాయిని అందుకునేందుకు దర్శకుడు సుకుమార్‌ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడని తెలుస్తోంది. షూటింగ్‌ ఈ ఏడాది ఆరంభంలోనే షురూ అవ్వాల్సి ఉన్నా కూడా స్క్రిప్ట్‌ లో మార్పులు.. సినిమా పై ఉన్న అంచనాలను అందుకోవడం కోసం సమయం తీసుకుంటున్నారు. ఇక కాస్టింగ్‌ విషయంలో కూడా పాన్‌ ఇండియా అప్పీల్‌ ను అద్దబోతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్‌ కు చెందిన పలువురు నటీ నటులను ఈ సినిమాలో నటింపజేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పేర్లతో పాటు తాజాగా మనోజ్ బాజ్ పేయి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన తెలుగు లో పలు సార్లు కనిపించిన విషయం తెల్సిందే.

అంతే కాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్‌ లతో కూడా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌ ఇంకా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. అలాంటి ఫ్యామిలీ మ్యాన్‌ పుష్ప లో ఉంటే కచ్చితంగా చాలా స్పెషల్ గా సినిమా ఉంటుందనే నమ్మకం ను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారట. ఒక విభిన్నమైన పాత్ర కోసం ఈయన్ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

నటుడిగా మనోజ్‌ బాజ్‌ పేయి ఎన్నో అద్బుతమైన పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన ప్రతి సినిమా లోని ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఈ సినిమా లో కూడా ఆయన ఉండటం వల్ల బిజినెస్ పరంగా మరియు సినిమాకు వచ్చే బజ్ పరంగా కూడా ఖచ్చితంగా హైప్ ఉంటుందని నమ్మకం వ్యక్తం అవుతోంది.

పుష్ప 2 సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయట. స్క్రిప్ట్‌ వర్క్ విషయంలో పూర్తిగా బన్నీ చాలా సంతృప్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా నటించబోతున్న ఈ సినిమా లో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఒక ఐటెం సాంగ్‌ చేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.