Begin typing your search above and press return to search.

వేడెక్కించే భంగిమ‌ల‌తో షేక్ చేసిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   3 April 2021 9:09 AM GMT
వేడెక్కించే భంగిమ‌ల‌తో షేక్ చేసిన మ‌నోహ‌రి
X
బాహుబ‌లి మ‌నోహ‌రిగా నోరా ఫ‌తేహి పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇండ‌స్ట్రీ బెస్ట్ డ్యాన్స‌ర్ గా రియాలిటీ జ‌డ్జిగా న‌టిగా నోరా ఫ‌తేహి హిందీ ప‌రిశ్ర‌మ‌లో పాపుల‌రైంది. కేవ‌లం ఆరేడేళ్ల‌లోనే ఈ భామ పాపులారిటీ అమాంతం పెరిగింది. మెరుపును త‌ల‌పించే నృత్య కదలికలు అందమైన రూపంతో యువ హృదయాలను శాసిస్తోంది.

అరేబియా మొరాకో నటిగా నర్తకిగా హిందీ వినోద పరిశ్రమలో పెద్ద కెరీర్ ని అందుకుంది. నోరా ఇండ‌స్ట్రీలో స్టైల్ ఐకాన్ గా ప్రయోగాలు చేయడానికి వెనుకాడదు. ఒక టీవీ షోలో కనిపించేటప్పుడు లేదా రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల్లో త‌న‌దైన శైలితో షో స్టాప‌ర్ గా నిలుస్తుంది.

అవార్డుల కార్య‌క్ర‌మం.. ఫ్యాష‌న్ ఈవెంట్లలో నోరా క్యాట్ వాక్ లకు ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. సోష‌ల్ మీడియాల్లోనూ ఈ అమ్మ‌డి స్పీడ్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.ఇటీవ‌ల‌ ఫిలింఫేర్ అవార్డ్స్ 2021 లో నోరా క‌ళ్లు చెదిరే స్టైల్ వ‌స్త్ర‌ధార‌ణ‌తో క‌ట్టి ప‌డేసింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి. నోరా ఫతేహి పొట్టి దుస్తులు అవార్డుల కార్య‌క్ర‌మంలో మిరుమిట్ల‌తో ఆక‌ర్షించాయి. ఆ ఎత్తు మడమల‌తో ఫ్లోర్ పై పాద‌ర‌సంలా క‌దిలిన తీరు ఆ భంగిమ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. తాజా ఫోటోలో నోరా ఫతేహిలోని ఫిట్‌నెస్ ఫ్రీక్ బ‌య‌ట‌ప‌డింద‌నే చెప్పాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా -సత్యమేవ జయతే 2 చిత్రాల్లో కనిపించ‌నుంది. నిజానికి నోరా రేంజ్ కి త‌గ్గ ఆఫ‌ర్ ఇంత‌వ‌ర‌కూ ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భారీ యాక్ష‌న్ డ్యాన్సుల‌తో హీట్ పెంచే పాత్ర‌ల్లో న‌టించేందుకు ఈ బ్యూటీ ఎప్పుడూ సిద్ధ‌మే. కానీ ఆ త‌ర‌హా ఆఫ‌ర్స్ త‌న‌వైపు రాలేద‌నేది అభిమానుల మాట‌.