Begin typing your search above and press return to search.

బాడీ ఫిట్ డ్రెస్ కి 2ల‌క్ష‌లు పెట్టిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   11 Oct 2020 10:00 AM IST
బాడీ ఫిట్ డ్రెస్ కి 2ల‌క్ష‌లు పెట్టిన మ‌నోహ‌రి
X
బాహుబ‌లి మ‌నోహ‌రిగా పాపుల‌రైంది కెన‌డియ‌న్ డ్యాన్స‌ర్ కం మోడ‌ల్ నోరా ఫ‌తేహి. అంత‌కుముందు ఎన్ని బాలీవుడ్ సినిమాల్లో ఐటెమ్ నంబ‌ర్లు చేసినా న‌టించినా రాని పేరు ఆ ఒక్క స్పెష‌ల్ నంబ‌ర్ తో ద‌క్కించుకుంది. అటుపై నోరా ఫ‌తేహి కెరీర్ విష‌య‌మై వెనుతిరిగి చూడ‌లేదు. హిందీ ప‌రిశ్ర‌మ స‌హా ఇటు సౌత్ లోనూ అమ్మ‌డు ఆటాడించేస్తోంది. కెన‌డా టు ఇండియా టూర్ల‌తో నిరంత‌రం బిజీ బిజీగా ఉండే నోరా ఆల్మోస్ట్ ముంబైలోనే సెటిలైంది.

ఈ భామ సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నే లేదు. రెగ్యులర్ ఫోటోషూట్లు వీడియో షూట్ల‌తో చెల‌రేగ‌డం ఈ అమ్మ‌డికే చెల్లిన‌ ప్ర‌త్యేక‌త‌. తాజాగా వైట్ టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో దుమార‌మే రేపింది నోరా. దీని ఖ‌రీదెంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. ఇంత సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాల 2 లక్షల రూపాయలు. ఈ వైట్ బాడీకాన్ దుస్తులలో నోరా ఫతేహి ఒక అంద‌మైన‌ కలలా కనిపిస్తోంది అంటూ అభిమానులు గుస్సాయించేస్తున్నారు.

నోరా ఫతేహి ఫ్యాషన్ ఎంపికలతో నిరంత‌రం చ‌ర్చ‌ల్లో ఉంటుంది. తనను తాను ఫ్యాషన్ ఐక‌న్ గా ఈ భామ ఏనాడో ప్ర‌క‌టించుకుంది. అది చీర అయినా,.. గౌను అయినా.. అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ వేర్ అయినా.. ఎలా హైలైట్ చేయాలో ఈ అమ్మ‌డికే తెలుసు. తాజా ఫోటోషూట్ కి `వైల్డ్ థింకింగ్ (sic)` అనే క్యాప్షన్ ఇచ్చింది.

తెలుపు బాడీకాన్ దుస్తులు నోరా లోని వొంపు సొంపుల్ని ఎలివేట్ చేస్తున్నాయి. ఆ వెండి మడమ చెప్పులు మ‌రో హైలైట్ . ఈ దుస్తులు పారిసియన్ డిజైనర్ హెర్వ్ లెగర్ చేత రూపొందించ‌బ‌డిన‌వి. నోరా ఫతేహి కెరీర్ సంగ‌తి చూస్తే.. ఇటీవల రియాలిటీ డ్యాన్స్ షో `ఇండియా బెస్ట్ డాన్సర్`‌లో క‌నిపించింది. షో షూటింగ్ ముగిశాక‌ విహారయాత్రకు గోవాకు వెళ్లింది ఈ భామ‌. `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో నోరా కీల‌క పాత్ర‌లో కనిపించ‌నుంది.