Begin typing your search above and press return to search.

ఆయనకు డబ్బింగ్.. ఈయన్ని కొట్టేవాడు లేడు

By:  Tupaki Desk   |   3 Jan 2019 5:30 AM GMT
ఆయనకు డబ్బింగ్.. ఈయన్ని కొట్టేవాడు లేడు
X
దాదాపు పాతికేళ్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి సినిమా తెలుగులో నేరుగా రిలీజవుతోంది. ‘బాషా’తో ఇక్కడ ఆయనకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ఆయన నటించే సినిమాలన్నింటినీ డబ్ చేసి.. నేరుగా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కొత్త సినిమా ‘పేట్ట’ విషయంలో ముందు కొంచెం సందేహాలు కలిగాయి కానీ.. చివరికి దాన్ని కూడా ఒకేసారి రెండుచోట్లా రిలీజ్ చేస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. డబ్బింగ్ హక్కుల డీల్ లేటుగా ముగియడం.. డబ్బింగ్ పనులు కూడా ఆలస్యంగా ఆరంభించడంతో ప్రమోషన్లలోనూ జాప్యం జరిగింది. విడుదలకు 8 రోజుల సమయం ఉండగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కు సంబంధించి తొలి ప్రోమో వదిలారు. నేరుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

తమిళ ట్రైలర్ తో పోలిస్తే చిన్న మార్పు కూడా లేదు. డిట్టో అదే వెర్షన్ ను డబ్ చేసి వదిలారంతే. ఐతే హడావుడిగా కానిచ్చినప్పటికీ డబ్బింగ్ దగ్గరేమీ తేడా రాలేదు. అన్ని క్యారెక్టర్లకూ బాగానే డబ్బింగ్ చెప్పించారు. వాయిస్ లు బాగానే సెట్టయ్యాయి. ఇక రజనీకి డబ్బింగ్ చెప్పే మనో గురించి చెప్పేదేముంది? ఎప్పట్లాగే అదరగొట్టేశాడు. ‘బాషా’తో పాటు ఇంకొన్ని సినిమాల్లో రజనీకి సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఎస్పీ బాలు కూడా వాయిస్ ఇచ్చారు. కానీ మనో వాయిస్ సెట్టయినట్లుగా ఇంకెవరిదీ సెట్ కాలేదు. అసలు రజనీకి ఎవరో డబ్బింగ్ చెప్పినట్లు కూడా అనిపించనట్లుగా మ్యాజిక్ చేయడం మనోకే చెల్లింది. రజనీలో ఉండే స్పీడు.. గ్రేస్ కు తగ్గట్లుగా ఆయన డబ్బింగ్ లో మాయ చేస్తారు. ‘పేట’ ట్రైలర్లోనూ ఆ మ్యాజిక్ కొనసాగింది. తమిళ ట్రైలర్ చూసిన వాళ్లకు ఏమాత్రం ఆడ్ గా అనిపించకుండా మనో పర్ ఫెక్టుగా డబ్బింగ్ చెప్పాడు. ఏదేమైనా రజనీకి వాయిస్ ఇవ్వాలంటే మనోను మించిన వాళ్లు లేరని మరోసారి రుజువైంది.