Begin typing your search above and press return to search.

మన్మధుడిని టెన్షన్‌ పెడుతున్న గ్యాంగ్‌ లీడర్‌

By:  Tupaki Desk   |   18 May 2019 6:15 AM GMT
మన్మధుడిని టెన్షన్‌ పెడుతున్న గ్యాంగ్‌ లీడర్‌
X
నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్‌ లీడర్‌'. ఇటీవలే ప్రారంభం అయిన ఈ చిత్రం దసరా లేదా ఆ తర్వాత ఎప్పుడైనా వస్తుందని అంతా భావించారు. కాని గ్యాంగ్‌ లీడర్‌ చిత్రాన్ని షాకింగ్‌ గా ఆగస్టు 30వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. నాని, విక్రమ్‌ కుమార్‌ ల కాంబోపై భారీ అంచనాలున్నాయి. పైగా నాని ఇటీవల 'జర్సీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఈ సమయంలో 'గ్యాంగ్‌ లీడర్‌' చిత్రంకు మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

గ్యాంగ్‌ లీడర్‌ చిత్ర విడుదల తేదీని ప్రకటించి నాని అండ్‌ టీం షూటింగ్‌ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడితే ఇదే సమయంలోనే 'మన్మధుడు 2' చిత్ర యూనిట్‌ సభ్యులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు మన్మధుడు 2 ను ఆగస్టు చివర్లో విడుదల చేయాలని భావించారు. త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం విడుదల తేదీ ప్రకటన వచ్చింది. దాంతో మన్మధుడు 2 చిత్రంను ఎప్పుడు విడుదల చేయాలా అనే ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సోలో గా రిలీజ్‌ అయితేనే మంచి వసూళ్లు నమోదు అవుతాయి. బాక్సాఫీస్‌ వద్ద రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఖచ్చితంగా రెండు సినిమాలపై ఆ ప్రభావం ఉంటుంది. అందుకే కనీసం వారం రోజుల గ్యాప్‌ ఉండాలని భావిస్తారు. అందుకే ఇప్పుడు 'గ్యాంగ్‌ లీడర్‌' చిత్రానికి మన్మధుడు 2 ఎంత గ్యాప్‌ ఉండాలనే విషయమై ప్రస్తుతం అక్కినేని టీం ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున ఈ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి మన్మధుడు 2 కి మంచి రిలీజ్‌ డేట్‌ దక్కి సక్సెస్‌ అయ్యేనా చూడాలి.