Begin typing your search above and press return to search.

మంచు ల‌క్ష్మి స్ఫూర్తితో మంజుల చానెల్‌‌?

By:  Tupaki Desk   |   8 Jun 2020 3:30 PM GMT
మంచు ల‌క్ష్మి స్ఫూర్తితో మంజుల చానెల్‌‌?
X
వెబ్ సైట్లు.. యూట్యూబ్ చానెళ్లు అంటూ సెల‌బ్రిటీలంతా కొత్త వ్యాప‌కాల‌తో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ.. అక్క‌డ త‌మ వెబ్ సైట్లు.. యూట్యూబ్ చానెళ్ల‌ను ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే ఇలా ఎందుకు? అంటే ఈ కొత్త‌ మార్గాల్లో ఆదాయ ఆర్జ‌నే ధ్యేయంగా.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం కోసం ట్రై చేస్తుండ‌డం చూస్తున్న‌దే.

అయితే దీనికోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టాల్సి ఉంటుంది. నిరంత‌రం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల్లో మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిందే. విష్ణు..మ‌నోజ్ ల సిస్ట‌ర్ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న సెల్ఫ్‌ ప‌బ్లిసిటీ స్టంట్ గురించి ఇంట్రో అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే మంచు ల‌క్ష్మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న‌కు సంబంధించిన చాలా విష‌యాల్ని ప్ర‌చారం చేసుకుంటారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌ర‌హాలోనే ఇండ‌స్ట్రీలో చాలా మంది సెల‌బ్రిటీ డాట‌ర్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ వారికి అంత గొప్ప మైలేజ్ లేనే లేదు.

ఇప్పుడు ల‌క్ష్మీ మంచు త‌ర‌హాలోనే సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సురాలు.. మ‌హేష్ సిస్ట‌ర్..న‌టి కం ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఘ‌ట్ట‌మ‌నేని మంజుల సొంత యూట్యూబ్ చానెల్ .. వెబ్ సైట్ ని ప్రారంభించారు. మంజుల ఘ‌ట్ట‌మ‌నేని పేరుతోనే వీటిని లాంచ్ చేసారు. ఇక ఇందులో త‌న ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్ స‌హా ఫ‌న్నీ వీడియోల్ని.. అలాగే ఎన్నో విష‌యాల్ని మంజుల అభిమానుల‌కు షేర్ చేయ‌నున్నార‌‌ట‌. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో మంజుల స్టార్ట్ చేసిన వెబ్ సైట్.. య్యూట్యూబ్ ఛానల్స్ పై ఫిల్మ్ న‌గ‌ర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఎవ‌రికి వారు సెల‌బ్రిటీలు సొంత చానెళ్ల తో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం బాగానే ఉంది కానీ.. మ‌రీ అంత ప‌బ్లిసిటీ పిచ్చి స‌రైన‌ది కాదేమో! అని సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.