Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ ప్రొడ్యూసరట

By:  Tupaki Desk   |   13 Nov 2017 3:47 AM GMT
పర్ఫెక్ట్ ప్రొడ్యూసరట
X
టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సిస్టర్స్ సినీ ఇండస్ట్రీలో కలుస్తుండడం చాలా అరుదని చెప్పలి. కానీ కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎదో ఒక వర్క్ చేస్తూ వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూడా దర్శకురాలుగా పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

సందీప్ కిషన్ హీరోగా - అమైరా దస్తూర్ అలాగే త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మంజుల సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటోంది. రీసెంట్ గా సినిమా షూటింగ్ స్పాట్ లోని కొన్ని పోటోలను మంజుల రిలీజ్ చేశారు. చిత్ర నిర్మాత కిరణ్ చాలా గొప్పవారని చెబుతూ.. భవిష్యత్ లో కూడా ఆయన మంచి విజయాలని అందుకుంటారు.

ఇక ఆయన తీసే సినిమాలు కూడా 100శాతం మంచి విజయాన్ని అనుకుంటాయని తెలిపారు. కిరణ్ ఇంతకుముందు కూడా నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే స్థాయిలో తెరకెక్కిస్తోన్న మంజుల ప్రాజెక్ట్ ని రిచ్ గా తియ్యాలని రెడీ అవుతున్నారు. మరి సినిమా ఎంత వరకేజ్ ఆకట్టుకుంటుందో చూడాలి.