Begin typing your search above and press return to search.

పవన్ కోసం మహేష్ సోదరి కథ

By:  Tupaki Desk   |   9 Feb 2018 4:53 PM IST
పవన్ కోసం మహేష్ సోదరి కథ
X
సూపర్ స్టార్ కృష్ణ గారి గారాల కూతురు - మహేష్ ప్రియమైన సోదరి మంజుల ఘట్టమనేని మొదట నిర్మాతగా ట్రై చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో దర్శకురాలిగా కూడా తన టాలెంట్ ను నిరూపించుకోవాలని చూస్తోంది ఈ స్టార్ బ్లడ్. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ తో కలిసి మనసుకు నచ్చింది అనే సినిమా ను ఇటీవల తెరకెక్కించిన మంజుల ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ లుక్స్ తో ఇప్పటికే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మధ్య ఒక షోలో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని ఉందని ఆమె చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కోసం మొత్తంగా ఒక స్పెషల్ స్క్రిప్ట్ ను మంజుల సెట్ చేసుకున్నారట. ఈ విషయాన్ని పక్కనే ఉన్న హీరో సందీప్ కిషన్ కూడా తెలిపాడు. ఆమె పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ కథను రాసుకున్నారని చెప్పడంతో మంజుల కూడా తన ఆలోచనను ఇంకా క్లారిటీగా ఇచ్చింది.

కృష్ణ - మహేష్ గారి తరువాత ఎంతో హార్ట్ ఫుల్ గా నచ్చే వారిలో నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఒక సినిమా చేయాలని ఒక కథను రసుకున్నా. ఆ కథ వింటే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. మీడియా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నా కథ వినండి అంటూ మంజుల తెలిపింది.

ప్రస్తుతం ఆయన సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని నాకు తెలుసు. కానీ నా సినిమా చేసి ఆయన మళ్లీ యధావిధిగా పాలిటిక్స్ లోకి వెళ్లవచ్చని మంజుల వివరించారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్త అందుతుందా?