Begin typing your search above and press return to search.

కృష్ణగారమ్మాయ్.. మెసేజ్ ఏంటంటే..

By:  Tupaki Desk   |   8 Nov 2017 9:36 AM GMT
కృష్ణగారమ్మాయ్.. మెసేజ్ ఏంటంటే..
X
హీరో సూపర్ స్టార్ కృష్ణ.. ముందుగా ఆయన పెద్దబ్బాయ్ రమేష్‌ బాబును హీరోగా పరిచయం చేశారు. అయితే ఆ తరువాత వారి బాటలోనే కూతురు మంజులు కూడా హీరోయిన్ అవుదాం అనుకుంది. కాని కుదర్లేదు. ఇప్పుడు దర్శకురాలి అవతారం ఎత్తుతోంది. సందీప్ కిషన్ హీరోగా.. అమైరా దస్తూర్.. మరియు త్రిదా చౌదరి హీరోయిన్లుగా ఒక సినిమాను మొదలెట్టింది. అదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్బంగా స్వయంగా మహేష్‌ బాబు ఆమె వీడియో ఒకటి విడుదల చేశాడు.

'ఫాలో యువర్ హార్ట్'.. మనస్సుకు నచ్చిందే చేయండి అంటూ మంజుల ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ ఇచ్చింది. ''మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. ఇదంతా కూడా మా ఫ్యామిలీ వలన.. ఫ్యాన్స్ వలన అనిపించింది. కాని దీనంతటికీ బాధ్యురాలిని నేనే'' అంటూ తన గురించి చెప్పుకుంది మంజుల. ''ఆ తరువాత నాకు నచ్చింది నేను చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నా హృదయాన్ని ఫాలో అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. గమ్యం ముఖ్యంకాదు.. ప్రయాణమే ముఖ్యం'' అంటూ ముగించింది. అలా చెబుతే ఆమె పేపర్లపై కథలు రాసుకుంటోంది కాబట్టి.. డైరక్టర్ అవ్వాలని చెప్పకనే చెబుతోంది అనుకోవచ్చు.

కాని విషయం ఏంటంటే.. డైరక్షన్లో ఇంకా సక్సెస్ కాకుండానే ఇలాంటి మెసేజ్ లు ఇస్తే వాటికి పెద్దగా వెయిట్ ఉండదు. ముందు అక్కడ హిట్టు కొట్టి.. అప్పుడు ఫాలో యువర్ హార్ట్ అంటూ మెసేజ్ చెబితే బాగుంటుంది అంటున్నారు ఫిలిం లవర్స్.