Begin typing your search above and press return to search.

చైతూ హీరోయిన్.. భలే ఛాన్సులే

By:  Tupaki Desk   |   4 Nov 2016 1:30 AM GMT
చైతూ హీరోయిన్.. భలే ఛాన్సులే
X
హీరోయిన్‌ గా తన తొలి సినిమా చూసి నటన మానేసుకోమంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం గురించి చెప్పుకుని తెగ ఫీలైపోయింది మలయాళ కుట్టి మాంజిమా మోహన్. అలాంటమ్మాయికి పిలిచి మరీ తన ద్విభాషా చిత్రంలో ఛాన్సిచ్చాడు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఈ సినిమా ఇంకా రిలీజే కాలేదు.. అప్పుడే ఆమెకు మంచి మంచి ఆఫర్లు వచ్చేస్తున్నాయి. తమిళంలో విక్రమ్ ప్రభు సినిమాతో పాటు ఇంకో మూడు ఆఫర్లు ఆమె చేతిలో ఉండగా.. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్టు ఆమె చేతికి వచ్చింది. స్టార్ హీరో ధనుష్ సరసన ఆమె కథానాయికగా నటించబోతోంది.

‘కోచ్చడయాన్’ లాంటి డిజాస్టర్‌ తో దర్శకురాలిగా పరిచయమైన రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య.. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సినిమాకు తన బావ ధనుష్‌ నే హీరోగా ఎంచుకుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఒక స్థానాన్ని స్టార్ హీరోయిన్ కాజల్ భర్తీ చేస్తుంటే.. ఇంకో స్థానానికి మాంజిమా మోహన్ ఎంపికైంది. ధనుష్ సరసన ఛాన్స్ అంటే స్టార్ హీరోయిన్ అయిపోవడానికి మంచి ఛాన్స్ దొరికినట్లే. కాజల్‌తో ధనుష్ ఇప్పటికే ‘మారి’ సినిమా చేశాడు. ‘కబాలి’ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను నిర్మించబోతున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్ మీదికి వెళ్తుంది. ధనుస్ ఇటీవలే కొడి (తెలుగులో ధర్మయోగి) హిట్టుతో మాంచి ఊపుమీదున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/