Begin typing your search above and press return to search.

మళ్ళీమళ్లీ కావాలంటున్న మంజిమా

By:  Tupaki Desk   |   29 Jun 2016 9:30 AM GMT
మళ్ళీమళ్లీ కావాలంటున్న మంజిమా
X
మంజిమా మోహన్ ఇప్పుడు ఒకేసారి తమిళ్ - తెలుగు భాషల్లో అరంగేట్రం చేయబోతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ద్వారా.. రెండు కొత్త ఇండస్ట్రీలకు పరిచయం అవుతోంది ఈ భామ. గౌతమ్ లాంటి గురువుతో రెండు పరిశ్రమలకు పరిచయం అవడం తన అదృష్టంగా చెప్పేస్తోంది మంజిమా. యాక్టింగ్ విషయంలో ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనిపించుకున్న ఈ భామకు.. సినిమా ఇండస్ట్రీ కొత్తేం కాదు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ అరడజన్ సినిమాల్లో కనిపించగా.. సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కుమార్తె ఈ మంజిమా మోహన్. 'నేను నా యాక్టింగ్ కెరీర్ ని దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ తో ప్రారంభించాను. ఆయనే నన్ను గౌతమ్ మీనన్ దగ్గరకు పంపారు. నాకు గౌతమ్ సార్ నుంచి కాల్ వచ్చినపుడు బోలెడంత సంతోషం వేసింది. మొదట్లో కొంత భయపడ్డా దర్శకుడు చెప్పిన సలహాలతో స్థిమిత పడ్డాను. నటులు తమలోని ట్యాలెంట్ ను ప్రదర్శించేందుకు గౌతమ్ మీనన్ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తారు' అని చెప్పింది మంజిమా మోహన్.

తెలుగు - తమిళ్ లో ఇప్పటికే వరుస ఆఫర్లు ఉన్నా.. ఇప్పటికైతే విక్రమ్ ప్రభుతో తప్ప కొత్త సినిమా ఒప్పుకోలేదని చెబుతోంది మంజిమా. సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అయ్యాక కొత్త సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటుందట. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసే అవకాశం మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. గౌతమ్ మీనన్ వరకూ ఈ విషయం వెళ్లిందో లేదో!