Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ మెగా హీరోల‌పై క‌న్నేసిందా?

By:  Tupaki Desk   |   2 Nov 2016 7:30 AM GMT
ఆ హీరోయిన్ మెగా హీరోల‌పై క‌న్నేసిందా?
X
తెలుగు తెర‌పైకి దూసుకు రానున్న మ‌రో మల‌యాళ కుట్టి మంజిమ మోహ‌న్‌. ఆమె నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `సాహ‌సం శ్వాస‌గా సాగిపో`లో న‌టించింది. ఇప్ప‌టికే త‌మిళంలో పెద్ద‌యెత్తున అవ‌కాశాల్ని అందుకొంటున్న ఆమె తెలుగులోనూ పాగా వేయాల‌ని చూస్తోంది. సాహ‌సం శ్వాస‌గా సాగిపో హిట్ట‌యితే ఆమె కోరిక ఫ‌లించ‌డం అసాధ్యమేమీ కాదు. కాక‌పోతే తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల్ని కాస్త విశాల థృక్ప‌ధంతో అర్థం చేసుకోవాలి. త‌మిళం - మ‌ల‌యాళం సినిమాల్లోలాగే క‌నిపిస్తాన‌ని కూర్చుంటే తెలుగు ప్రేక్ష‌కులు ఒప్పుకోరు. ఇక్క‌డ కాసిన్ని అంద‌చందాలు ఆర‌బోయాలి. అయితే మంజిమ మాత్రం తాను ఎక్స్‌ పోజింగ్‌ కి ఆమ‌డ‌దూరం తెలుసా? అంటూ గారాలు పోతోంది.అయినా తొలి అడుగుల్లో అంద‌రూ ఇలాగే అంటారు - ఒక‌ట్రెండు సినిమాలు చేశాక వాళ్లే అల్లుకుపోతారు.

అయితే మంజిమ మాత్రం తెలుగులో మెగా హీరోల‌పై క‌న్నేసిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. మెగా హీరోల సినిమాలు మ‌ల‌యాళంలోనూ బాగా విడుద‌ల‌వుతుంటాయి కాబ‌ట్టి ఆ అల‌వాటుతోనో, లేదంటే లెక్క ప్ర‌కార‌మే జ‌పిస్తుందో తెలియ‌డం లేదు కానీ... తెలుగులో ఇష్ట‌మైన హీరోలెవ‌ర‌ని అడిగిన వెంట‌నే ఆ లిస్టు పెద్ద‌గానే ఉందంటూనే అల్లు అర్జున్‌ - రామ్‌ చ‌ర‌ణ్ పేర్లు చెప్పేసింది. వాళ్ల సినిమాలు బాగా చూస్తుంటాన‌ని కూడా చెప్పింది మంజిమ‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/