Begin typing your search above and press return to search.
గాయనిని పెళ్లాడుతున్న మణిశర్మ వారసుడు
By: Tupaki Desk | 12 Oct 2021 10:47 AM ISTసంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు.. యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ టాలీవుడ్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. `ఛలో`..`భీష్మ`..`మాస్ట్రో` చిత్రాలకు సంగీతం అందించి తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్న స్వర సాగర్ మహతి ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గాయని సంజన కలమంజతో ఆయనకు ఆదివారం నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతోనే విషయం బయటకు వచ్చింది. ఇక సాగర్ పెళ్లాడే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం.
సంజనా కలమంజే కోలీవుడ్..టాలీవుడ్..శాండిల్ వుడ్ చిత్రాల్లో పాటలు పాడారు. సాగర్ సంగీతం అందించిన భీష్మ లో `హేయ్ చూసా` అనే పాటను ఆమె ఆలపించారు. మరి వీరిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన సంబంధమా? అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలాగే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? వేదిక ఎక్కడ అన్న వివరాలు కూడా కుటుంబ సభ్యులు రివీల్ చేయలేదు. కేవలం ఫోటోల్ని మాత్రమే అభిమానులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక సాగర్ సంగీతం అందించిన తొలి చిత్రం `ఛలో`తో మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కు ముందే ఆడియో బ్లాక్ బస్టర్ అయింది.
`చూసి చూడంగానే నచ్చాసేవే` పాటతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. సాగర్ సంగీత దర్శకుడు కాకముందు తండ్రి వద్ద సౌండ్ ఇంజనీర్ గా పనిచేసాడు. ఆ తర్వాత తండ్రి సూచనలు..సలహాలు.. శిక్షణ మేరకు సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సాగర్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. సాగర్ సంగీతం అందిస్తున్న సినిమాలకు మణిశర్మ కూడా వెనుకుండి సహకారం అందిస్తున్నారు. కుమారుడి కెరీర్ ని బిల్డ్ చేయడంలో తండ్రి పాత్ర అత్యంత కీలకమని తెలుస్తోంది.