Begin typing your search above and press return to search.

మ‌ణిశ‌ర్మ బ‌ర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా!

By:  Tupaki Desk   |   12 July 2022 10:15 AM GMT
మ‌ణిశ‌ర్మ బ‌ర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా!
X
మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాకి మ్యూజిక‌ల్ గా ముందే హిట్ ఇవ్వ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. సినిమా ఎలా ఉన్నా? మ్యూజిక‌ల్ గా హిట్ చేయ‌డం మ‌ణిస‌ర్ స్పెషాల్టీ. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించారు. ఎంతో మంది స్టార్ హీరోల‌కు బాణీలు స‌మ‌కూర్చారు. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాకు మ‌రో హిట్ ఆల్బ‌మ్ అందించారు.

ఆ సినిమా ఫ‌లితం గురించి ప‌క్క‌న‌బెడితే! మ్యూజిక‌ల్ గా సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. మ‌ణి స‌ర్ ఎప్పుడోచ్చినా పంచ్ ప‌వ‌ర్ ఫ‌వ‌ర్ ఒకేలా ఉంటుంద‌ని 'ఆచార్య' సంగీతం నిరూపించింది. ప్రస్తుతం ఆయ‌న చాలా సెల‌క్టివ్ గానే సినిమాలు చేస్తున్నారు. కుమారుడు మ‌హ‌తి సాగ‌ర్ కూడా అదే వృత్తిలో కొన‌సాగ‌డంతో ఎక్కువ‌గా విరామంలోనే ఉంటున్నారు. మ‌హ‌తీని వెనుకు నుండి న‌డిపిస్తున్నారు.

బుధ‌వారం మణిశర్మ పుట్టిన రోజు కావ‌డంతో ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు- ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో బర్త్ డే గ్రాండ్ గా జ‌రిగింది. ఈ సెలబ్రేషన్స్ లో కొంత మంది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్.. డైరెక్టర్ మెహర్ రమేష్ మ‌ణి స‌ర్ పార్టీలో చిందులేసారు.

మ‌ణిశ‌ర్మ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని పార్టీ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతోంది. గతంలో మెహర్ రమేష్ తెర‌కెక్కించిన 'కంత్రి'.. 'శక్తి'.. 'బిల్లా' సినిమాలకు మణిశర్మ మ్యూజిక్ అందించిన‌ సంగ‌తి తెలిసిందే.

అలాగే మణిశర్మ వ‌ద్ద శిష్యరికం చేసిన థమన్ నేడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. త‌మ‌న్ కి ముందు. వెనుకొచ్చిన వాళ్ల‌ని సైతం బీట్ చేసి టాప్ మ్యూజిక్ సెన్షేష‌న్ గా కొన‌సాగుతున్నారు. ఆయ‌న్ని క‌దిపితే గురువు గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. ఆయ‌న వ‌ల్ల ఈ స్థానం లో ఉన్న‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడు సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు.

అందుకే గురువు పార్టీని అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెహ‌ర్ ర‌మేష్ వీడియోలో మ‌ణిశ‌ర్మ‌ని ఎంతో ఆప్యాయంగా హ‌త్తుకున్నారు. ఇద్ద‌రు క‌లిసి డాన్స్ సైతం చేసారు. మ‌ణిశ‌ర్మ చాలా రిజ‌ర్వ‌డ్ గా ఉంటార‌ని చాలా మంది అంటుంటారు. కానీ పార్టీల స‌మ‌యంలో మ‌ణిస‌ర్ ఎంత యాక్టివ్ గా ఉంటారు? అన్న‌ది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.