Begin typing your search above and press return to search.

చేస్తే సిమ్రన్‌తోనే చేయాలంటోంది

By:  Tupaki Desk   |   11 Jun 2015 12:53 PM IST
చేస్తే సిమ్రన్‌తోనే చేయాలంటోంది
X
దాదాపు దశాబ్ధం పైగానే తెలుగు, తమిళ్‌ తెరని ఏలిన మేటి కథానాయిక సిమ్రన్‌. అందానికి అందం, అందుకు తగ్గ అభినయం, డ్యాన్సింగ్‌ స్టయిల్‌ ఉన్న కథానాయికగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఈ భామ ప్రస్తుతం 'త్రిష ఇలియాన నయనతార' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. అయితే ఇదే సినిమాలో తనకి వీరాభిమాని అయిన కుర్రతార మనీషా యాదవ్‌ కూడా నటిస్తోంది.

మనీషా బెంగళూరు బాలిక. ముందుగా కోలీవుడ్‌లో ప్రవేశించింది. అట్నుంచి అనువాద చిత్రాలతో తెలుగుకి పరిచయమైంది. అదలాల్‌ కాదల్‌ తెలుగు అనువాదం ప్రేమించాలితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంలో స్కూలు పిల్లగా చక్కని అభినయం కనబరిచింది. క్యూట్‌ లుక్స్‌, హాట్‌ అప్పియరెన్స్‌ ఈ అమ్మడి ప్రత్యేకత. లింగుస్వామి, బాలాజీ శక్తివేల్‌ ప్రోత్సాహంతో కథానాయికగా తొలి అడుగులు వేసింది. తాజాగా 'త్రిష ఇలియాన నయనతార' చిత్రంలో తన అభిమాన నటి సిమ్రన్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని చెప్పింది. అయితే తనతో కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నా, ఒకే ఫ్రేములో కనిపించే ఛాన్స్‌ రాలేదని తెగ బాధపడిపోతోంది.

ఓ వీరాభిమానిగా ఆ అవకాశం వస్తుందని ఎంతో ఆత్రంగా ఎదురు చూశానని అంది. అంతేనా మనీషా ఇంకా చాలా సంగతులే చెప్పింది. ఏదైనా సినిమాకి అంగీకరించాలంటే అందులో సంథింగ్‌ ఉంటేనే ఒకే చెబుతా. అజిత్‌, ధనుష్‌ లాంటి స్టార్లతో నటించాలనుందని ఓపెన్‌గా మనసును ఆవిష్కరించింది.