Begin typing your search above and press return to search.

డబుల్‌ ఏజ్‌ ప్రియుడు ఓవర్‌ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 May 2016 5:00 PM IST
డబుల్‌ ఏజ్‌ ప్రియుడు ఓవర్‌ చేస్తున్నాడు
X
మనీష్‌ రైసింగానీ అనే నటుడి పేరు ఎప్పుడైనా విన్నారా? అబ్బే ఇతగాడు అంత పాపులర్‌ కాదు. కాకపోతే హిందీ సీరియల్స్ చూసేవారికి బాబు బాగానే పరిచయం అయ్యుంటాడు. ఇప్పుడు మనోడు చేస్తున్న ఓవర్‌ యాక్షన్‌ మామూలుగా లేదు సుమీ.

మ్యాటర్ ఏంటంటే.. మొన్ననే హీరోయిన్‌ అవికా గోర్‌ తో కలసి మనోడు కేన్స్ చలనచిత్రోత్సవం రెడ్‌ కార్పెట్‌ లో నడిచాడు. అక్కడ మన టాలీవుడ్‌ బాబులందరూ అవిక ఎంత స్లిమ్‌ అయ్యిందో అని ఆనందపడుతుంటే.. బాలీవుడ్‌ మాత్రం.. ఈ డబుల్‌ ఏజ్‌ ప్రియుడు ఇంకా ఆమెను వదల్లేదా అంటూ సెటైర్లు వేసిపాడేశాడు. మేము కేవలం మాంచి ఫ్రెండ్స్ అంతే అని చెప్పుకు తిరుగుతున్న అవిక అండ్‌ మనీష్‌ గురించి ఎప్పటినుండో రొమాంటిక్ లింకప్‌ కథలు వింటూను ఉన్నాం. ఈ 18 ఏళ్ళ పిల్లకు ఆ 36 ఏళ్ల బ్యాచిలరుడుతో ఏంటండీ స్నేహం అంటూ కామెంట్లు పడుతూనే ఉన్నాయ్‌. ఇవన్నీ మళ్లీ పడటంతో.. అసలు స్నేహానికి ఇలాంటి పాపాన్ని అంటగడతారా అంటూ మనీష్‌ సీరియస్‌ అయ్యాడు.

ఎవరి మీద అవుతావ్ రాజా? రూమర్లనేవి వస్తుంటాయ్‌. కాని ఉత్తినే ఫైర్‌ లేకుండా పొగ రాదుగా.