Begin typing your search above and press return to search.
ఆగిపోయాయ్ కానీ.. ఆ ఐదు తీసుంటేనా
By: Tupaki Desk | 16 Sept 2016 10:11 AM ISTఇండియన్ ఫిలిం హిస్టరీలో మణిరత్నం రాసిన పేజీలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా.. మనసులను తట్టే కథలను రాసుకుని.. ఈయన తీసిన సినిమాలు కమర్షియల్ మూవీ మేకర్స్ ను కూడా భయపెట్టేసేవి. ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ మణిరత్నం అనౌన్స్ చేసిన 5 ప్రాజెక్టులు రద్దయిపోయాయి. ఆ ఐదు సినిమాలు తీసి ఉంటే కనుక మణి సార్ రేంజ్ మరో రేంజ్ లో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తుంటాయి.
బాహుబలి.. రోబోల కంటే ముందే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో నిలిచిపోయే భారీ చిత్రాన్ని తలపెట్టాడు మణిరత్నం. విజయ్.. మహేష్ బాబు.. అనుష్క.. విశాల్ లతో అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. అయితే.. ఈ సినిమా కోసం భారీ గుడుల సెట్స్ వేయాల్సి రావడంతో.. ప్రాజెక్టు లాభాల్లోకి చేరే ఛాన్స్ లేదని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
మహేష్ బాబు-నాగార్జునలతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలని భావించాడు మణి రత్నం. నాగ్ ఈ ప్రాజెక్టును ఓకే చేసినా.. ఇద్దరు హీరోలు 4 నెలలకు పైగా బల్క్ డేట్స్ ఇవ్వాలన్న కండిషన్ కారణంగా ఇది కూడా ఆగిపోయింది.
దుల్కర్ సల్మాన్.. కార్తీ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ ను మణి ప్రారంభించాల్సి ఉంది. నిత్యా మీనన్.. కీర్తి సురేష్ లను కూడా ఎంపిక చేశారు. దుల్కర్ తప్పుకోవడంతో నాని జాయిన్ అయ్యాడు. అయితే.. ఏ నిర్మాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ముందుకు రాక.. ఇది అటకెక్కేసింది.
మణిరత్నం- అమీర్ ఖాన్ కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు పెరిగిపోయాయి. లజ్జో అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కానీ.. ఈయన గురు పైనే కాన్సంట్రేషన్ చేస్తున్నాడని అమీర్ అలిగాడు. మరోవైపు మంగళ్ పాండే పేలిపోవడంతో.. నిర్మాత బాబీ బేడీ వెనకడుగు వేశాడు. అలా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
రామ్ చరణ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు మణి రత్నం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని భావించినా.. ఫైనల్ డ్రాఫ్ట్ చెర్రీకి నచ్చక ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్టును మణి రత్నం తిరిగి పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. చరణ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఇక స్టార్ట్ అవడమే లేట్ అంతే.