Begin typing your search above and press return to search.

మణిరత్నం మార్క్ మల్టీ స్టారర్

By:  Tupaki Desk   |   4 April 2019 8:17 AM GMT
మణిరత్నం మార్క్ మల్టీ స్టారర్
X
చాలా కాలం నుంచి తన స్థాయి సినిమా లేక ఇబ్బంది పడుతున్న మణిరత్నం ఈసారి మరో క్రేజీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడు. నవాబ్ కూడా ఇదే కోవలోకి వచ్చినప్పటికీ అందులో అరవింద్ స్వామి అరుణ్ విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావడంతో అంత హైప్ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. తమిళ్ లో ఓ మాదిరిగా ఆడినా తెలుగులో మాత్రం డిజాస్టర్ తప్పలేదు. ఇప్పుడు మణిరత్నం ప్లాన్ చేసిన కొత్త మూవీ సుప్రసిద్ధ కల్కి రచన పోన్నియన్ సెల్వన్. ఇప్పుడు క్యాస్టింగ్ కి సంబంధించిన కీలకమైన అప్ డేట్స్ బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం. నటీనటులు వాళ్ళకు సంబంధించిన పాత్రల పేర్లు ఈ విధంగా ఉన్నాయట

విక్రం - ఆదిత్య కరికాలన్

కార్తి - వంతియ దేవన్

జయం రవి - ఆరుళ్ మొజి వర్మన్

కీర్తి సురేష్ - కుంతవై

అమితాబ్ బచ్చన్ - సుందర చోజన్

ఐశ్వర్య రాయ్ - నందిని

మోహన్ బాబు - పెరియ పజువెట్టరయర్

ఇది అధికారికంగా ప్రకటించిన సమాచారం కాదు కాని యూనిట్ నుంచి లీకైన అతి కీలకమైన అప్ డేట్. అత్యంత ప్రతిష్టాత్మకంగా మణిరత్నం కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందే ఈ మూవీలో సౌత్ నార్త్ ఆర్టిస్టులు సమంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉత్తరాదిని టార్గెట్ చేస్తూ అమితాబ్ ఐష్ లను తీసుకోగా తెలుగు ఫ్లేవర్ కోసం మోహన్ బాబుని సెట్ చేసుకున్నారు.

ఇందులో ఒక్క జయం రవి తప్ప తెలుగు ప్రేక్షకులకు అందరూ బాగా సుపరిచితులే. సో డబ్బింగ్ పరంగా బిజినెస్ కోణంలో ఎలాంటి ఇబ్బందులు రావు. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఈ పాత్రల స్వభావాలు కథలో ఎంత స్పాన్ ఉంటుంది లాంటి వివరాలు అతి త్వరలోనే తెలుస్తాయి. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.