Begin typing your search above and press return to search.

మణిరత్నం ‘భారీ’ చిత్రానికి మహమ్మారి దెబ్బ?

By:  Tupaki Desk   |   30 May 2020 5:40 PM IST
మణిరత్నం ‘భారీ’ చిత్రానికి మహమ్మారి దెబ్బ?
X
మణిరత్నం.. ఒకప్పుడు క్లాసిక్ చిత్రాలతో దక్షిణాదిలో సంచలన సృష్టించిన ఈ ప్రముఖ దర్శకుడి మ్యాజిక్ ఇప్పుడు పని చేయడం లేదు. దక్షిణాది ప్రముఖ దర్శకుడిగా ఈయన పేరు నాడు మారుమోగింది. నేడు హిట్టు లేక ఆయన ఆపసోపాలు పడుతున్నారు.

తాజాగా మణిరత్నం రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ భారీ చిత్రంలో విక్రమ్, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ప్రభు, జయరామ్, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ తదితర భారీ తారాగణం నటిస్తోంది. వీరిపై థాయ్ లాండ్ అడవుల్లో కీలకమైన దృశ్యాలను చిత్రీకరించారు.

చెన్నైలో భారీ సెట్టింగ్ లు నిర్మించి షూటింగ్ జరపాలని మణిరత్నం నిర్ణయించారు. అయితే మహమ్మారి వ్యాప్తితో షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

చారిత్రిక సినిమా కావడంతో ప్రభుత్వం సినిమాలకు అనుమతి ఇచ్చినా ఇందులో వందలాది మంది సైనికులుగా నటించాల్సి ఉంది. ఇప్పుడు మహమ్మారి ప్రబలడంతో ఇంతమందితో షూటింగ్ నిర్వహించడం కష్టమే. వందల సంఖ్యలో ఫెఫ్సీ కార్మికులతో యుద్ధ సన్నివేశాలకు ప్లాన్ చేసిన మణిరత్నం ఇప్పుడు కరోనా దెబ్బకు ఎలా తీయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.

దీంతో ఈ మహమ్మారి తగ్గిపోయే దాకా.. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం షూటింగ్ కు సుధీర్ఘ విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు మణిరత్నం.

ఈ లోగా అరవింద్ సామితో ఓ కొత్త సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు లాక్ డౌన్ లోనే కొత్త కథకు స్రిప్ట్ ను కూడా మణిరత్నం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.