Begin typing your search above and press return to search.

మణిరత్నం 'నవాబ్' మొదలెట్టాడు

By:  Tupaki Desk   |   9 Feb 2018 5:44 PM GMT
మణిరత్నం నవాబ్ మొదలెట్టాడు
X

కోలీవుడ్ సీనియర్ దర్శకుడు చాలా రోజుల తరువాత సౌత్ లో ఒక మల్టి స్టారర్ చేయబోతున్నాడు. పెద్ద సినిమా అనలేము గాని స్పెషల్ సినిమా అని మాత్రం చెప్పవచ్చు. గత కొంత కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం సినిమాను చెక్కుతున్న మణిపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాను స్టార్ట్ చేయలేక సతమతమవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా నటీనటులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కొంత మంది ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మలయాళ నటుడు ఫహాద్ ఫజిల్ తప్పుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు గాని మణిరత్నం సినిమా ఆగిపోలేదని ఒక పోస్టర్ ద్వారా గుర్తు చేశాడు. సినిమా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశాడు. తెలుగులో 'నవాబ్' మరియు తమిళ్ లో 'చెక్కా చివంత్ వానం' అనే పేరు పెట్టారు. అరవింద్ స్వామి - శింబు మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. జయ సుధ - ఆదితి రావు - ఐశ్వర్య రాజేష్ మరియు దయానా వంటి నటిమణులు కూడా సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రం మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుత ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఎండింగ్ కు వచ్చేసినట్లు తెలుస్తోంది. మణిరత్నం చిత్ర యూనిట్ ని మొత్తం సెట్ చేసేసుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తో పాటు ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ మరోసారి మణిరత్నం తో వర్క్ చేయడానికి సిద్దమయ్యారు.