Begin typing your search above and press return to search.

మణిరత్నం ప్లాన్ వర్కౌట్ అవుతోంది

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:40 PM IST
మణిరత్నం ప్లాన్ వర్కౌట్ అవుతోంది
X
కోలీవుడ్ సీనియర్ దర్శకుడు మణిరత్నం గత కొంత కాలంగా విజయం కోసం ప్రయత్నాలు చాలానే చేస్తున్నాడు. కానీ ఎన్ని ప్రయోగాత్మక ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకు హిట్టు అందడం లేదు. గత సినిమాలు రిలీజ్ అయ్యే ముందు క్రేజ్ కూడా పెద్దగా అందలేదు. అయితే ఈ సారి సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగేలా ప్లాన్ చేసుకున్నాడు. కేవలం సినిమా కోసం తారలను ఎంచుకుంటూనే సినిమా స్థాయిని చూపిస్తున్నాడు. చూస్తుంటే ఈ సారి మణి హిట్టు కొట్టాలనే కసితో ఉన్నట్లు అనిపిస్తోంది.

అందులోను కొన్ని కథనాల ప్రకారం సినిమా ఒక ఇష్యు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం జరుగుతోందని తెలియడంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఆ ఇష్యు ఏమిటంటే తమిళనాడు లో సంచలనం సృష్టించిన న్యూక్లియర్ ప్లాంట్ వివాదం చుట్టూ మణి కథను చూపుతాడట. దానికి నవాబ్ అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నాడు. తెలుగు తమిళ్ మలయాళం లో ఈ సినిమా రిలీజ్ కానుంది. నాలుగురు అన్నదమ్ములు ఒక అమ్మాయి కథలో కీలకం. అందులో పవర్ఫుల్ లేడిగా అదితి రావ్ హైదరి కనిపించనుంది.

ఇక ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరనే విషయం సస్పెన్స్. అయితే అరవింద్ స్వామి మాత్రం రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్ర వహిస్తుండగా.. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. మెయిన్ విలన్ గా మాత్రం ముందుగా చెపినట్టుగా అరుణ్ విజయ్ కనిపిస్తాడు. మరికొంత మంది నటీనటులు కూడా సినిమాలో కీలక పాత్ర పోశించబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ సినిమా షూటింగ్ లో పాల్గొనేంత వరకు ఆ విషయం తెలిసేలా లేదు. మణిరత్నం ఈ నవాబ్ సినిమాను బొంబాయి రేంజ్ లో తీయాలని చూస్తున్నాడు. మరి ఆ తరహాలో సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.