Begin typing your search above and press return to search.
బావ, బావ మరిది మధ్య రివెంజ్ ప్లాన్
By: Tupaki Desk | 19 Jan 2016 10:41 AM ISTదిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్లాన్ చేస్తున్న ఓ మూవీ కోసం యాక్టర్స్ వేట ఓ కొలిక్కి వచ్చింది. అక్కినేని హీరో నాగ చైతన్య - దగ్గుబాటి వారసుడు రాణాలను లీడ్ రోల్స్ కి తీసుకుని, సినిమా చేయబోతున్నాడు మణి. రివెంజ్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ మూవీని.. తెలుగు - తమిళ్ లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.
అసలు ఈ మూవీ కోసం మొదటగా అనుకున్నది మహేష్ బాబు - నాగార్జున లని. అయితే ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నాగ్ కూడా కుదరదన్నాడు. ఆ తర్వాత దుల్కర్ సుమన్ - కార్తీలను తీసుకుని మూవీ స్టార్ట్ చేయాలనుకున్నాడు మణిరత్నం. మొదట దుల్కర్ గుడ్ బై చెప్పేయగా.. కార్తీ డేట్స్ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేవు. దీంతో మరోసారి హీరోల కోసం వేట సాగించిన ఈ దర్శకుడు.. చివరకు రాణా - చైతూల దగ్గర ఆగాడు.
ఇప్పటికే ఈ మూవీ కోసం నిత్యా మీనన్ - కీర్తి సురేష్ లను హీరోయిన్లుగా తీసుకున్నారు కూడా. కేవలం హీరోల డేట్స్ కారణంగానే ఇంత ఆలస్యం అయింది. త్వరలో ఈ మూవీ డీటైల్స్ ను మణి స్వయంగా వెల్లడించనున్నారు. మొదట తెలుగు, తమిళ్ లో వేరు వేరు హీరలతో చేద్దామని అనుకున్నారు కానీ.. ఇప్పుడు మాత్రం రెండు భాషల్లోనూ చైతూ, రాణాలే లీడ్ రోల్స్ పోషించనున్నారు. ఈ రివెంజ్ డ్రామాకి అన్నీ సెట్ అయినట్లే నని, త్వరలో షూటింగ్ ప్రారంభించడం ఖాయమంటున్నాయి యూనిట్ వర్గాలు.