Begin typing your search above and press return to search.

28 ఏళ్ల తర్వాత మణిరత్నం క్లాసిక్ రీమేక్

By:  Tupaki Desk   |   11 May 2016 7:00 PM IST
28 ఏళ్ల తర్వాత మణిరత్నం క్లాసిక్ రీమేక్
X
దిగ్గజ దర్శకుడు మణిరత్నం సినిమాలను ఆడియన్స్ ఇష్టపడ్డానికి ప్రధాన కారణం.. వాటిలో ఉండే ఫ్రెష్ నెస్. ఈయన సినిమాలను ఎప్పుడు చూసినా అవేవో పాతతరం మూవీస్ అనే ఫీలింగ్ కలిగించవు. అందుకే ఇప్పుడు మణిరత్నం 28 ఏళ్ల క్రితం తీసిన సినిమాను రీమేక్ చేసేందుకు.. బాలీవుడ్ రెడీ అవుతోంది. అగ్ని నచ్చతిరమ్.. తెలుగులో ఘర్షణ అనే టైటిల్ 1988లో ఓ మూవీ వచ్చింది.

ఇద్దరు భార్యలకు పుట్టిన ఒకే తండ్రి సంతానం మధ్య ఏర్పడే ఘర్షణే ఈ సినిమా. ప్రభు - కార్తీక్ లు అన్న దమ్ములుగా నటించిన ఈ మూవీ తమిళ్ లోనే కాదు, తెలుగులో కూడా సూపర్ హిట్. 200 రోజుల పాటు ఫుల్ కలెక్షన్స్ తో ఆడిన మొదటి తమిళ్ మూవీగా ఈ చిత్రానికి అరుదైన రికార్డ్ ఉంది. ఈ మూవీని బాలీవుడ్ రీమేక్ చేసేందుకు డైరెక్టర్ బెజాయ్ నంబియార్ సిద్ధమయ్యాడు. 'ఇప్పుటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. విక్కీ కౌశల్ - హర్షవర్ధన్ రాణేలు హీరోలుగా నటించబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది' అని దర్శకుడు బెజాయ్ చెబుతున్నాడు.

అమితాబ్ బచ్చన్ - ఫరాన్ అక్తర్ - అదితి రావు హైదరిలతో రీసెంట్ గా ఈయన తీసిన మూవీ వాజిర్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ అగ్ని నచ్చరితమ్ మూవీ.. హిందీలో ఓ సారి రీమేక్ అయింది. వన్ష్ అనే టైటిల్ పై.. సిద్ధార్ధ్ రే - సుదేష్ బెర్రీలు ప్రధాన పాత్రల్లో నటించగా 1992లో ఇది విడుదలైంది. ఇప్పుడు మరోసారి మణిరత్నం క్లాసిక్ రీమేక్ అవుతుండడం విశేషం.