Begin typing your search above and press return to search.
కమల్ బాటలో మణిరత్నం
By: Tupaki Desk | 28 Sept 2015 11:00 PM ISTతెలుగులో సినిమా తీస్తా తీస్తా అని చాలా ఏళ్లుగా చెబుతూ వచ్చిన కమల్ హాసన్.. ఎట్టకేలకు ‘చీకటి రాజ్యం’తో మాట నిలబెట్టుకుంటున్నాడు. డైరెక్టుగా తెలుగులో సినిమా తీయకున్నా కనీసం ద్విభాషా చిత్రంగా తన సినిమాను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల్ని గౌరవిస్తున్నాడు. ఇప్పుడు మణిరత్నం కూడా అదే బాటలో నడవబోతున్నాడు. తనను ఎంతగానో అభిమానించే తెలుగు ప్రేక్షకుల కోసం తన తర్వాతి సినిమాను ద్విభాషా చిత్రంగా తెరకెక్కించబోతున్నాడు.
మణిరత్నం మామూలుగానే తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడి టాప్ లిరిసిస్టులు, రైటర్లతో పాటలు, మాటలు రాయించుకుంటాడు. డబ్బింగ్ సమయంలో కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. మొన్నటి ‘ఓకే బంగారం’ విషయంలోనూ ఆయన పెట్టిన శ్రద్ధ తెరమీద స్పష్టంగా కనిపించింది.
ఐతే కార్తి - దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ - కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో మణి తర్వాత తీయబోయే సినిమాను ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించబోతున్నారాయన. ముందే తెలుగు స్క్రిప్టు కూడా రాయించి.. వేర్వేరుగా సన్నివేశాలు తీయబోతున్నారు. ఇప్పటికే ఆయన తెలుగు రచయితను సంప్రదించి స్క్రిప్టు నరేట్ చేస్తున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్తుంది.