Begin typing your search above and press return to search.

చరణ్ మీద మణిరత్నం ఎఫెక్ట్ గట్టిగానే..

By:  Tupaki Desk   |   23 May 2017 4:39 PM IST
చరణ్ మీద మణిరత్నం ఎఫెక్ట్ గట్టిగానే..
X
ఇంతకుముందు రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ చరణ్.. ఈ మధ్య రూటు మార్చాడు. మారుతున్న ట్రెండుకు తగ్గట్లుగా భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేసిన చరణ్.. ఇప్పుడు సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో ఓ వైవిధ్యమైన సినిమాను లైన్లో పెట్టాడు. తనలో వచ్చిన ఈ మార్పుకు మణిరత్నం కారణమని ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ చరణ్ చెప్పడం గుర్తుండే ఉంటుంది. అప్పుడప్పుడూ భిన్నమైన సినిమాలు చేయాలని మణిరత్నం తనకు చెప్పారని.. ఆ సలహానే పాటిస్తున్నానని చరణ్ అన్నాడు. ఐతే మణిరత్నం ప్రభావం చరణ్ మీద వేరే రకంగానూ ఉన్నట్లుంది.

తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి చరణ్ ఎంచుకున్న కెమెరామన్ ఎవరో తెలిస్తే.. అతడిపై మణిరత్నం ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుంది. మణిరత్నం తీసిన కొత్త సినిమా ‘చెలియా’కు అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన రవివర్మనే ‘ఉయ్యాలవాడ..’కూ పని చేస్తుండటం విశేషం. మణిరత్నం సూచన మేరకే చరణ్ రవివర్మన్ ను ‘ఉయ్యాలవాడ..’ కోసం ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా తమిళుడైన రాజీవన్ ను ఎంచుకోవడం విశేషం. అతను తమిళంలో చాలా చాలా పెద్ద సినిమాలే చేశాడు. తెలుగులో 1 నేనొక్కడినే.. మనం లాంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. మిగతా టెక్నీషియన్లు కూడా పెద్ద పెద్ద వాళ్లే ఈ సినిమాకు పని చేయబోతున్నట్లు సమాచారం.