Begin typing your search above and press return to search.
ఎప్పటికి వాటిని చేయనంటున్న మణిరత్నం
By: Tupaki Desk | 16 April 2020 4:00 PM ISTతమిళ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ సెల్వన్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఒక వైపు స్క్రిప్ట్ పనులు చేస్తూ మరో వైపు నటీనటుల ఎంపిక పక్రియ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా స్క్రిప్ట్ చర్చలు నిలిపేసినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తూ ఉండే మణిరత్నం తాజాగా సరదాగా తన భార్య సుహాసినితో సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు.
ఈ సందర్బంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు తన ఇష్టా ఇష్టాలను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తన ఫ్యూచర్ ఫ్లాన్స్ ను చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్స్ పలువురు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లు తెరకెక్కించేందుకు రెడీ అయ్యే అవకాశం ఉందని మరి మీరు వెబ్ సిరీస్ లపై ఆసక్తిగా ఉన్నారా అంటూ మణిరత్నంను ఒక నెటిజన్ ప్రశ్నించగా తనకు ఎప్పుడు కూడా బుల్లి తెరపై ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి లేదు. నేను వెబ్ సిరీస్ మేకింగ్ విషయంలో అస్సలు ఆసక్తిగా లేనంటూ చెప్పుకొచ్చాడు.
గతంలో తాను ఫీచర్ ఫిల్మ్స్ చేయడం జరిగిందని.. కాని అవి బుల్లి తెరపై సక్సెస్ కాలేదు కనుక మళ్లీ ఆ వైపుకు అడుగులు వేయాలనే ఉద్దేశ్యం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. షోలు కాని.. వెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కించను అంటూ ఈయన ప్రకటించాడు. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా స్టార్ డైరెక్టర్స్ పలువురు వెబ్ సిరీస్ లను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని మణిరత్నం మాత్రం బుల్లి తెర అంటేనే నాకు అక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.