Begin typing your search above and press return to search.
అది నాకు చేతకాదంటున్న మణిరత్నం
By: Tupaki Desk | 7 April 2017 6:00 AM ISTఒకప్పుడు సినీ కుటుంబాలకు చెందిన వారసులు వేరే రంగాల వైపు చూసేవాళ్లు. కానీ ఈ మధ్య ఆ కల్చర్ కనిపించట్లేదు. సినిమా కుటుంబాల్లోని వ్యక్తులందరూ కూడా సినిమాల్లోనే స్థిరపడాలనుకుంటున్నారు. కేవలం సెలబ్రెటీల కొడుకులు మాత్రమే కాదు.. వారి కూతుళ్లు.. వేరే బంధువులు కూడా సినీ రంగంలోనే వెలిగిపోవాలని ఆశపడుతున్నారు. అలాంటిది మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ కొడుకు మాత్రం తండ్రి బాటలో నడవాలనుకోవట్లేదు. ఇప్పటిదాకా సినిమా రంగునే అంటించుకోని మణి కొడుకు నందన్.. విద్యారంగంలోనే ఎదుగుతుండటం విశేషం.
తన కొడుకు గురించి ఓ ఇంటర్వ్యూలో మణి మాట్లాడుతూ.. ‘‘నందన్ కు సినిమాలంటే ఇష్టం లేదు. ప్రస్తుతం పీహెచ్ డీ చేస్తున్నాడు. విద్యావేత్తగా స్థిరపడాలన్నది నందన్ కోరిక. రాజకీయాల్లంటే చాలా ఆసక్తి. నేను చదువుకొన్నది ఒకటి. చేసే పని మరొకటి. జీవితంలో నేను నేర్చుకొన్న విద్య ఎందుకు ఉపయోగపడలేదు. అలా అని నాకు చదువు గురించి వ్యతిరేక అభిప్రాయం లేదు. చదువుకుంటే చెడిపోతారని నేను అసలు చెప్పను. చదువు అనే మనిషికి హోదా కల్పిస్తుంది’’ అని మణి అన్నాడు. ‘‘మహిళా కథా చిత్రాలను తీయడం నాకు చాలా ఇష్టం. సినిమాలో మహిళలను శృంగార కోణంలోనే వాడుకోవడం నచ్చదు. నా కెరీర్ లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను చాలానే చేశాను. రోజా.. సఖి.. మౌనరాగం.. చెలియా చిత్రాల కథలన్నీ మహిళల చుట్టే తిరుగుతాయి. వాళ్ల పాత్రలే సినిమాను నడిపించాయి’’ అని మణిరత్నం అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/