Begin typing your search above and press return to search.

మానికే టీజర్: నోరా వొంపుసొంపుల థిల్లానా

By:  Tupaki Desk   |   16 Sep 2022 3:40 AM GMT
మానికే టీజర్: నోరా వొంపుసొంపుల థిల్లానా
X
బాహుబ‌లి మ‌నోహ‌రిగా నోరాఫ‌తేహికి ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. ఇటీవ‌ల ఈ భామ సింగిల్ ఆల్బ‌మ్స్ తో ఆక‌ట్టుకుంది. తాజాగా 'థాంక్స్ గాడ్' మూవీ ట్రైలర్ లో నోరా ఫతేహి డ్యాన్సింగ్ క‌ద‌లిక‌లు ఆకర్షణీయంగా మారాయి. నోరా పాట మాణికే టీజర్ ఈ రోజు విడుదలైంది. ఇది అత్యధికంగా వీక్షించిన వాటిలో ఒకటిగా రికార్డుల‌కెక్కుతోంది.

థ్యాంక్ గాడ్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా యాక్సిడెంట్ తో నరకానికి వెళ్లి ఆపై చిత్రగుప్తుడితో గేమ్ ఆడుతూ తన విధిని తానే నిర్ణయించుకునేవాడిగా క‌నిపిస్తాడు. నోరా ఫతేహి ఆటలోని కామం భాగంలోని మనికే పాటలో ఉత్సాహం కలిగించే దేవదూతగా కనిపిస్తుంది.

సింగర్ యోహాని పాడిన మణికే పాట బాగా ఫేమ‌స్ అయ్యింది. నోరా ఫతేహి అద్భుతమైన నృత్య‌ కదలికలతో ఈ పాట‌ ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. పూర్తి పాట రేపు విడుదల కానుంది.

నోరా ఫ‌తేహి డ్యాన్సింగ్ స్కిల్స్ ఎబిలిటీ కి ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ఉంది. రాబోవు పాట‌కు అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.