Begin typing your search above and press return to search.

మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' షూట్ అక్కడేనా..??

By:  Tupaki Desk   |   4 Jun 2021 7:00 PM IST
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ షూట్ అక్కడేనా..??
X
కోలీవుడ్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం సినిమాలు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్స్ లిస్టులో ఉంటాయి. మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ దొరికినట్లే అని చెప్పాలి. ఇన్నేళ్లుగా ఆయన మేకింగ్‌ స్టైల్ ఇష్టపడని వారుండరు అంటే.. ఆయన సినిమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సెలబ్రిటీస్ నుండి ఆడియన్స్ వరకు అందరు మణిరత్నం సినిమాలకు దాసోహమే అంటారు. అయితే కొన్నేళ్లుగా ఆయన ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. చివరిగా వచ్చినటువంటి నవాబ్ మూవీ మోస్తరు విజయం సాధించినా ప్రేక్షకుల దృష్టి మాత్రం ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా పైనే ఉంది.

ఈసారి మణిరత్నం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు. ఓ ప్రముఖ తమిళ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పొన్నియన్ సెల్వన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాలో సౌత్ నుండి నార్త్ వరకు చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, అతిథిరావు హైదరీ, అశ్విన్, జయరామ్ లాంటి స్టార్స్ ఉన్నారు. మణిరత్నం ఒక్కో సినిమా ఒక్కో లైబ్రరీ అంటూ చెబుతుంటారు సినీ సెలబ్రిటీలు. కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్టుకోసం ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి అంతలా ఆకట్టుకోలేకపోయింది.

ఈ మూవీకి మొదటినుండి షూటింగ్ అంతరాయము జరిగుతూనే ఉంది. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ అక్కడ కాన్సల్ అయిపోయింది. సరే దూరం వెళ్లకుండా చెన్నైలోనే షూటింగ్ కానిద్దాం అనుకుంటే ఇక్కడ కూడా అదే స్థాయిలో కరోనా పరిస్థితి నెలకొంది. అందుకే చెన్నైలో కూడా పొన్నియన్ షూటింగ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మణిరత్నం టీమ్ పరిస్థితులు చక్కబడితే మళ్లీ మధ్యప్రదేశ్ లోని మండవ - మహేశ్వర్ ప్రాంతాలలో షూటింగ్ ప్రారంభిద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్ లేటెస్ట్ సమాచారం.. పొన్నియన్ సెల్వన్ షూటింగ్ జూన్ 15 నుండి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.