Begin typing your search above and press return to search.

అలాంటి షాట్లు మన దగ్గర రావట్లేదబ్బా

By:  Tupaki Desk   |   27 Jan 2017 9:54 AM IST
అలాంటి షాట్లు మన దగ్గర రావట్లేదబ్బా
X
ఇప్పుడు టాలీవుడ్ అంతా హీరోయిన్ల ఇంట్రొడక్షన్ గురించి తెగ చర్చలు చేసుకుంటున్నారు. నిజానికి ఒకప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇలా హీరోయిన్లను చాలా సెక్సీగా తెరపై ఇంట్రొడ్యూస్ చేయడం అనే ఐడియాను మొదలెట్టారు. ముందు కాళ్ళూ.. తరువాత పెదాలు.. ఆ తరువాత వివిధ కొలతలన్నీ చూపించుకుంటూ వచ్చి ముఖాన్ని రివీల్ చేస్తారాయన. అంతకంటే మునుపు సీనియర్ డైరక్టర్లు అందరూ.. హీరోయిన్ల కళ్ల రెపరెపలతో వారిని తెరపై తొలిషాట్ లో చూపించేవారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పటికీ హీరోయిన్ ను ఇంట్రొడ్యూస్ చేయడం అంటే.. మణిరత్నం చేసినంత స్పెషల్ గా మాత్రం మన దగ్గర ఎవ్వరూ చేయలేకపోతున్నారు అంటున్నారు సినిమా లవ్వర్స్. నిన్న రిలీజైన ''చెలియా'' సినిమా తొలి సాంగ్ టీజర్ లో చూడండి.. అసలు మంచు పడుతున్నప్పుడు అదితీ రావ్ హైదారీని ఆయన ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసిన షాట్ అద్భుతమనే చెప్పాలి. అసలు ఒక ప్రక్కన మన దగ్గర క్లాసిక్ లవ్ స్టోరీలే రావట్లేదని అనుకుంటే.. మరో ప్రక్కన ఇలాంటి షాట్స్ కూడా ఎక్కడా కనిపించట్లేదు అని సినిమాలు తీసే వెటరన్లు కూడా అంటున్నారులే.

మరి కొత్తగా తయారవుతున్న డైరక్టర్లు అందరూ.. అసలు మణిరత్నం అలాంటి షాట్లను ఇంప్రెసివ్ ఎలా తీస్తున్నాడో స్టడీ చేసి.. మన దగ్గర కూడా అలాంటివి ఏమన్నా ప్రయత్నిస్తారని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/